Varanasi : విశాఖ.. గెట్ రెడీ.. బాబు దిగుతున్నాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ క్రమంలో కొత్త షెడ్యూల్ కు రంగం సిద్ధమైంది. ఈ భారీ బడ్జెట్ సినిమా తాజా షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ వైజాగ్ చేరుకున్నట్లు తెలిసింది. దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తన టెక్నికల్ టీంతో కలిసి వైజాగ్ లో ల్యాండ్ అయినట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో హీరో మహేష్ బాబు కూడా పాల్గొనబోతున్నారట. ఆయనపై కొన్ని అత్యంత కీలకమైన సన్నివేశాలను వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ఈ షెడ్యూల్ సినిమాలో కీలకంగా ఉంటుందని సమాచారం.
ఇటీవల హైదరాబాద్ లో వేసిన కాశీ సెట్ తో పాటు, వారణాసిలో కొన్ని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు జక్కన్న. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి వైజాగ్ లో సందడి చేయనున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ లో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత కే.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ విజువల్ వండర్ ను నిర్మిస్తున్నారు. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ మూవీని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న ‘వారణాసి’తో ఈసారి రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
-
OTR: బీజేపీలో 25 మందికి షాక్? ఎమ్మెల్సీ టికెట్‌పై బిగ్ ట్విస్ట్!
-
Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
-
Breast Cancer: తేనెటీగ విషంతో క్యాన్సర్‌కు చెక్ పెట్టొచ్చా? పరిశోధనల్లో ఏం తేలింది?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ అసలు కథేంటో చెప్పిన రష్మిక మందన్న!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!