Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna: సినిమా మొదలుపెట్టే ముందే ‘పాన్ ఇండియా’ అని ఆలోచించడం వల్ల వచ్చే అనవసరపు తలనొప్పులను అక్కినేని నాగార్జున చాలా ప్రాక్టికల్‌గా ఎండగట్టారు. ఇటీవల చిన్న సినిమా మొదలు పెద్ద ప్రాజెక్ట్ వరకు ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ హడావుడి చేస్తుండటంపై నాగ్ తనదైన శైలిలో చురకలు అంటించారు. సినిమా తీసేటప్పుడే పాన్ ఇండియా అని మైండ్‌లో పెట్టుకుంటే మొత్తం గందరగోళం మొదలవుతుందని నాగార్జున విశ్లేషించారు. “మనం మొదట్లోనే అలా అనుకుంటే ఏ భాష యాక్టర్లను పెట్టుకోవాలి? వేరే వాళ్లను తెచ్చి ఇరికించాలా? డైలాగులు ఎలా రాయాలి? ఈ డైలాగ్ ఆ భాషోళ్లకు నచ్చుతుందా? మన కల్చర్, మనం కట్టే లుంగీలు వాళ్లకు ఎక్కుతాయా? అంటూ పనికిమాలిన నాన్సెన్స్ అంతా బుర్రలోకి వచ్చేస్తుంది” అంటూ నాగ్ అసలు విషయాన్ని బయటపెట్టారు.
ఇతర రాష్ట్రాల ప్రేక్షకుల అభిరుచుల కోసం కథలోని సహజత్వాన్ని మార్చడం సరికాదని ఆయన తేల్చిచెప్పారు. “తెలుగు సినిమాని తెలుగు సినిమా లాగే తీయాలి.. ఆ తర్వాతే మిగతావన్నీ” అంటూ సూటిగా స్పష్టం చేశారు. మన నేటివిటీని కాపాడుకుంటూ మంచి సినిమా తీస్తే, దాన్ని దేశవ్యాప్తంగా ప్రేక్షకులే ఆదరిస్తారనే విషయాన్ని నాగార్జున గుర్తుచేశారు. కథను వదిలేసి అనవసరపు కమర్షియల్ లెక్కలు వేసుకునే మేకర్స్‌కు నాగ్ మాటలు కచ్చితంగా ఒక రియాలిటీ చెక్ లాంటివని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Nag – Chiru Multistarrer: మెగాస్టార్‌తో మల్టీస్టారర్.. ఎప్పుడు చేస్తారో చెప్పిన నాగార్జున!
- Nagarjuna: 'చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?'.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
- Sundeep Kishan: 'కరికాల' నా కెరీర్ బెస్ట్.. సందీప్ కిషన్ బిగ్గెస్ట్ ప్లాన్!
- Indian Cinema: ఇండియన్ సినిమాకు పట్టిన ఈ 'బడ్జెట్ పిచ్చి' ఎవరిని ముంచుతుంది?
తాజావార్తలు
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
-
Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!