Okkadu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కెరీర్ టర్నింగ్ మూవీ ఒక్కడు. అప్పటి వరకు ప్రిన్స్ ట్యాగ్ లైన్ తో ఉన్న మహేశ్ బాబును.. ఓవర్ నైట్ లో సూపర్ స్టార్ ను చేసిన మూవీ ఇది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో భూమిక హీరోయిన్ గా చేసింది. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ సినిమాగా నిలిచిపోయింది ఇది. ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ సినిమాలు రీ రిలీజ్ అవుతున్నాయి. తాజాగా ఒక్కడు మూవీని కూడా రీ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. ఏప్రిల్ 26వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రీ రిలీజ్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
Read Also : Raviteja : మాస్ జాతర సాంగ్.. ‘చూపుల్తో గుచ్చి గుచ్చి’ స్టెప్పులేసిన రవితేజ
ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టు దీన్ని కట్ చేశారు. హైదరాబాద్ లోని విశ్వనాథ్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్ లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఒక్కడు సినిమాకు ఇప్పటికీ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఇందులో ప్రకాశ్ రాజ్ పవర్ ఫుల్ విలన్ గా అదరగొట్టాడు. ఇందులోని ప్రతి సీన్, డైలాగ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంటాయి. ఈ మూవీలోని డైలాగులను ఇప్పుడు ట్రోల్స్, మీమ్స్ కోసం వాడేస్తుంటారు. అంతగా ఇందులోని డైలాగులు ఫేమస్ అయ్యాయి. అప్పట్లో మహేశ్ ను ఇండస్ట్రీలో పెద్ద హీరోగా నిలబెట్టిన ఈ సినిమా.. ఇప్పుడు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని ఎదురు చూస్తున్నారు.