Mahesh Babu: మహేష్ అలా చేసినప్పుడల్లా బాక్సాఫీస్ కి బొమ్మ కనిపించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ టైటిల్ ని మే 31న థియేటర్స్ లో రిలీజ్ చేస్తాం, అది కూడా అభిమానులు చెప్పే కౌంట్ డౌన్ తో అని మేకర్స్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసారు. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని వెనక్కి తిరిగి సిగరెట్ తాగుతూ కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో ఈ పోస్టర్ ని ట్రెండ్ చేస్తున్నారు. #SSMB28 అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి మహేశ్ ఫాన్స్ ట్వీట్స్ వేస్తున్నారు. పూజా హెగ్డే, శ్రీలీలా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ గుంటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుందనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. అందుకే టైటిల్ కూడా దాదాపు నేటివిటీ మ్యాచ్ అయ్యేలా మాస్ కనెక్ట్ అయ్యేలా ‘గుంటూరు కారం’ని ఫైనల్ చేసారని సమాచారం.
ఇదిలా ఉంటే మహేశ్ బాబు హెడ్ బ్యాండ్ కట్టిన ప్రతిసారీ బాక్సాఫీస్ కి బొమ్మ చూపిస్తూ ఉంటాడు. రీజనల్ సినిమాలతో కూడా కలెక్షన్స్ లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేసే మహేశ్ బాబు మొదటిసారి ‘పోకిరి’ మూవీలో హెడ్ బ్యాండ్ కట్టాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అప్పటివరకూ టాలీవుడ్ లో ఉన్న ప్రతి బాక్సాఫీస్ రికార్డుని బ్రేక్ చేసింది. ఆ తర్వాత కొరటాల శివ డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సినిమాలో కూడా మహేశ్ హెడ్ కి బ్యాండ్ కట్టాడు. ఈ మూవీ ఏకంగా నాన్-బాహుబలి రికార్డులని క్రియేట్ చేసింది. ఈ సెంటిమెంట్ ని బేస్ చేసుకోని #SSMB28 సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఘట్టమనేని అభిమానులు చెప్తున్నారు. అతడు, ఖలేజ సినిమాలతో మహేశ్-త్రివిక్రమ్ లు హిట్ కొట్టలేక పోయారు కానీ ఈసారి మాత్రం పాన్ ఇండియా రేంజులో హిట్ కొట్టడం గ్యారెంటి అనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది. మరి ఆ నమ్మకాన్ని త్రివిక్రమ్, మహేశ్ బాబు నిజం చేస్తారో లేదో తెలియాలి అంటే 2024 జనవరి 12 వరకూ ఆగాల్సిందే.
Also Read
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: ప్రయోగాలు ప్రేక్షకులను మెప్పించాయి.. సింగీతంకు డిప్యూటీ సీఎం పవన్ నివాళి!
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!