Mahesh Babu: మహేష్ బాబు- త్రివిక్రమ్.. టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకొనే కాంబోలో ఈ కాంబో టాప్ 5 లో ఉంటుంది. అంతలా వీరి కాంబోకు ఫ్యాన్స్ ఉన్నారు.అతడు సినిమాతో వీరి జర్నీ స్టార్ట్ అయ్యింది. ఒక సీరియస్ క్యారెక్టర్ తో మహేష్ ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఇప్పటికీ నందు ఒక ఎమోషన్. ఇక మహేష్ అంటే.. ఒక సీరియస్ లుక్ ఉంటుంది. కామెడీ చేసినా కూడా కొంతవరకే. ఏ డైరెక్టర్ కూడా మహేష్ ను ఫుల్ లెంత్ లో కామెడీ చేయిస్తూ చూపించలేకపోయారు. కానీ, దైర్యం చేసి.. త్రివిక్రమ్, మహేష్ తో ఖలేజా లాంటి సినిమా తీసి చూపించాడు. అవుట్ అండ్ అవుట్ మహేష్ కామెడీతో పిచ్చెక్కించాడు. ఆ సినిమాలో స్టార్ కమెడియన్స్ బ్రహ్మానందం, ఆలీ, సునీల్ ఉన్నా కూడా మహేష్ చేసిన కామెడీని మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. అనుకోని విధంగా ఖలేజా విజయాన్ని అందుకోలేకపోయింది కానీ, మహేష్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీలో ఖలేజా ఉంటుంది. ఒక హీరో అంతలా ప్రేక్షకులను నవ్వించడం అనేది అరుదైన విషయం. ఇక ఆ సినిమా తరువాత వీరి కాంబోలో ఇప్పుడు వస్తున్న చిత్రం గుంటూరు కారం.
ట్రైలర్ రిలీజ్ అయ్యేవరకు చాలామందికి ఈ కాంబో మీద చాలా అనుమానాలు ఉన్నాయి. ఒక్కసారి ట్రైలర్ చూసాక.. మహేష్ బాబును పూర్తిగా వాడుకున్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే అది త్రివిక్రమ్ అనే చెప్తారు. ఆ కామెడీ పంచ్ లు, డైలాగ్స్ వేరే లెవెల్. ట్రైలర్ మొదటి నుంచి ఎండ్ వరకు మహేష్ వన్ మ్యాన్ షో చూపించాడు. చూడంగానే మజా వచ్చిందా హార్ట్ బీట్ పెరిగిందా ఈలెయ్యాలి అనిపించిందారమణ గాడు..లాంటి డైలాగ్స్ తో పాటు.. పాణి గాడి కూతురు మంచి ఫిగరే.. అబ్బా.. సిగ్గొస్తుంది రా అంటూ రొమాన్స్ చూపించినా.. హారతి ఇవ్వలేకపోయావా మరి అంటే.. అగ్గిపెట్టె లేక ఆగిపోయా అని వెటకారం చూపించి మాట్లాడినా కూడా మహేష్ కు సెట్ అయిపోయింది అంతే. ఆ అగ్గిపెట్టె స్టైల్ అయితే ట్రెండ్ అవ్వడం ఖాయం. అస్సలు ఇలాంటి ట్రైలర్ కట్.. మహేష్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ ను తెప్పించింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ట్రైలర్ చూశాక ప్రతి మహేష్ బాబు ఫ్యాన్ అనే ఒకే ఒక్క మాట.. గురూజీకి గుడి కట్టినా తప్పులేదురా.. అస్సలు ఆ ట్రైలర్ ఏంటీ.. మహేష్ పంచ్ లు ఏంటీ..? అనే. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.