Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీ లీల జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చిన్న బాబు మరియు సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరో హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది మొదటి నుంచి ఈ సినిమా చేయడానికి సంక్రాంతికి రిలీజ్ అవుతుందని మేకర్స్ తెలిపారు. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా విషయంలో జరుగుతున్న కొన్ని అనుకోని సంఘటనలు వలన వచ్చే ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం రాదు అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. వరుసగా గుంటూరు కారం చిత్ర బృందం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడం, మహేష్ బాబు వెకేషన్ కి వెళ్లడం, షూటింగ్ కంప్లీట్ కాకపోవడం వలన వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా..? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nanditha Swetha: పెళ్లి కూతురిగా మారిన ‘హిడింబ’ హీరోయిన్
ఇక ఈ అనుమానాలకు మహేష్ చెక్ పెట్టాడు. గుంటూరు కారం వచ్చే ఏడాది సంక్రాంతికి కన్ఫర్మ్ అని తేల్చి చెప్పేశాడు. నేడు బిగ్ సి 20వ వార్షికోత్సవ సెలబ్రేషన్స్ లో పాల్గొన్న మహేష్ గుంటూరు కారం రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చాడు. సంక్రాంతికి గుంటూరు కారం ఖచ్చితంగా వస్తుందని, మీరందరూ చాలా సంతోషిస్తారని తెలిపాడు. దీంతో అభిమానుల అనుమానాలు పటాపంచలు అయ్యాయి. ఖచ్చితంగా వచ్చే ఏడాది సంక్రాంతికి బాబు ల్యాండ్ అవుతాడు.. నో డౌట్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో మహేష్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
jan 12th….2024 pic.twitter.com/IhivE9cAYM
— Naga Vamsi (@vamsi84) August 20, 2023