Nanditha Swetha: ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన కన్నడ బ్యూటీ నందితా శ్వేత. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న నందిత తెలుగువారికి దగ్గర అయిపోయింది. విజయాపజయాలను పక్కనపెడితే ఈ చిన్నది అవకాశాలను అయితే బాగానే అందుకుంటుంది. ఇక ఈ మధ్యనే హిడింబ సినిమాలో అశ్విన్ బాబుతో రొమాన్స్ చేసింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ అందుకుంది. అంతేకాకుండా ఓటిటీలో కూడా మంచి విజయాన్నే అందుకుంది. ఇక సినిమాలే కాకుండా సోషల్ మీడియాలో నందిత చేసే రచ్చ అంతా ఇంత కాదు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్స్ తో కుర్రకారును మెస్మరైజ్ చేస్తుంది. ఇక తాజాగా నందిత పెళ్లి కూతురి గెటప్ లో కనువిందు చేసింది.
Samantha: మరోసారి ప్రేమలో పడిన సామ్.. ఈసారి ఆంక్షలు కూడా
పెళ్లి కూతురు అనగానే పెళ్లి అవుతుంది అని కాదు.. బ్రైడల్ ఫోటోషూట్ కోసం నందిత పెళ్లి కూతురిగా మారింది. ఇక గత కొంతకాలంగా ఆమె ఒక యూట్యూబ్ ఛానల్ ను రన్ చేస్తుంది. ఈ ఛానెల్ కలో ఆమె తన బ్రైడల్ ఫోటోషూట్ కోసం ఎలా రెడీ అయ్యింది అనేది చూపించింది. ఇక బంగారు వర్ణంలో మెరిసే చీరతో నిజంగానే బంగారు బొమ్మల తయారయ్యింది. ఆమె లుక్ చూస్తే నిజంగానే పెళ్లి కూతురు అనే భావన వస్తుంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియోలు, ఫోటోలు చూశాక అభిమానులు సైతం త్వరగా పెళ్లి చేసుకోండి మేడమ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ భామ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తుందేమో చూడాలి.