Mahesh Babu busy in an ad shoot: గురూజీ త్రివిక్రమ్ తో గుంటూరు కారం సినిమా చేసిన మహేష్ ఆ సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఆ సినిమాకి మిక్డ్స్ టాక్ వచ్చింది. ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం తమకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అని సినిమా నిర్మాతలు ప్రకటించారు. ఇక ఈ సినిమా పూర్తయిన తర్వాత ఆయన రాజమౌళితో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా మే నెలలో పట్టాలు ఎక్కాల్సి ఉంది. అయితే ఈ సినిమా కోసం వచ్చిన గ్యాప్ లో ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా ఒక పక్క బాడీ బిల్డ్ చేసే పనిలో ఉంటూనే మరోపక్క యాడ్ ఫిలిమ్స్ చేసే పనిలో పడ్డాడు. తాజాగా మహేష్ బాబు సెట్స్‌పైకి వచ్చాడు. అయితే సినిమా షూట్ కోసం కాదండోయ్, ఒక యాడ్ షూట్ కోసం. ఇప్పుడు హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో మహేష్ మీద యాడ్ కమర్షియల్‌ను చిత్రీకరిస్తున్నారు.
Actor Sivaji: వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. ?
భారతదేశంలోని అతిపెద్ద సెలబ్రిటీలలో ఒకరయిన మహేష్ బాబు ఇప్పటికే అనేక బ్రాండ్‌లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల నుండి కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని తెలుస్తోంది. సినిమాల ద్వారా వచ్చే సంపాదన కంటే వీటి ద్వారా వచ్చే వార్షిక ఆదాయం మహేష్ కి చాలా ఎక్కువని అంటున్నారు. ఇక ఈ యాడ్స్ హడావుడి అయ్యాక మహేష్ బాబు తన కాన్సంట్రేషన్‌ను దర్శకధీరుడు రాజమౌళి ప్రాజెక్ట్‌కి బదిలీ చేయవలసి ఉంటుంది. మహేష్ బాబు తదుపరి చిత్రం అగ్ర దర్శకుడు రాజమౌళితో ఉంటుంది. గ్లాబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ కోసం ప్రీ-ప్రొడక్షన్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. ఇంకా టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ మే తర్వాత ప్రారంభమవుతుంది.