స్టార్ డైరెక్టర్ కి క్షమాపణలు చెప్పిన మహేష్ బాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ మహేష్ బాబు.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు చెప్పారట.. ఈ విషయాన్నీ వెల్లడించారు. ఇటీవల మహేష్ బాబు, బాలయ్యబాబు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఇక ఈ షోలో బాలయ్య, మహేష్ నుంచి గట్టి సీక్రెట్ లనే రాబట్టారు. ఆయన పెళ్లి దగ్గర నుంచి ఆయన సినిమా షూటింగ్ మధ్యలో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ల వరకు అన్నింటిని ఆయన నోటినుంచే చెప్పించారు. ఇక డైరెక్టర్ల ద్వారా కొన్ని సీక్రెట్లను రివీల్ చేయించి.. మహేష్ తో ఆ ఇన్సిడెంట్ ని ఫినిష్ చేయించారు. ఇక ఈ ఇన్సిడెంట్లల్లో మెహర్ రమేష్.. డైరెక్టర్ శంకర్ కి క్షమాపణలు ఎందుకు చెప్పాల్సివచ్చింది అనేది చెప్పమని కోరారు.
ఇక దీంతో మహేష్ ఈ విధంగా వివరించారు. ” ఓ సారి ముంబై మారిటన్ హోటల్‌లో నేను, ఫ్యామిలీతో పాటు టిఫిన్ చేయటానికి వెళ్ళాను. అక్కడ మహేష్ వచ్చాడు అని ఇద్దరు అమ్మాయిలు సెల్ఫీ కోసం నా దగ్గరకు వచ్చారు. నేను ఫ్యామిలీతో వచ్చాను ఇప్పుడు కాదు అని చెప్పగానే వాళ్లు వెళ్లిపోయారు. అంతలోనే మెహర్ రమేష్ వచ్చి ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరో తెలుసా.. డైరెక్టర్ శంకర్ కుమార్తెలు అని చెప్పారు. వెంటనే నేను పరిగెత్తుకుంటూ వెళ్లి వారిని ఆపాను. . సారీ సర్ మీ అమ్మాయిలు అని తెలియక అలా అన్నాను అని చెప్పాను. పర్లేదు.. హీరోలంటే ఎలా ఉంటారో వాళ్లకి కూడా తెలియాలి కదా అని డైరెక్టర్ శంకర్ అన్నారు” అంటూ ఆ ఇన్సిడెంట్ ని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం మహేష్ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది . బాలయ్య- మహేష్ ఫన్ ఫుల్ ఎపిసోడ్ ని మీరు కూడా లుక్కెయ్యండి.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్‌ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్‌వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!