Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దశాబ్దాలుగా వెండితెరపై తన స్టెప్పులతో, ఫైట్లతో, మాస్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మెగాస్టార్ చిరంజీవి.. ఇప్పుడు రూటు మార్చారు. సిల్వర్ స్క్రీన్‌ను శాసించిన ఈ బాక్సాఫీస్ రారాజు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోకి సంచలన ఎంట్రీ ఇస్తున్నారు. ప్రముఖ గ్లోబల్ ఓటీటీ దిగ్గజం ‘నెట్‌ఫ్లిక్స్’ వేదికగా ‘చిరంజీవీస్ మెగావర్స్’ (Chiranjeevi’s MegaVerse) పేరిట ఓ సరికొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఓటీటీల్లో టాక్ షోల ట్రెండ్ విపరీతంగా నడుస్తున్న ఈ కాలంలో.. సాక్షాత్తూ ఇండస్ట్రీ పెద్ద, మెగాస్టార్ స్వయంగా రంగంలోకి దిగుతుండటం ట్రేడ్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ షో కేవలం రెగ్యులర్ చిట్-చాట్లా కాకుండా, టాలీవుడ్ లెగసీని, దిగ్గజాల ప్రయాణాలను సెలబ్రేట్ చేసుకునేలా డిజైన్ చేయడం అసలైన హైలైట్. తనదైన చరిష్మా, చమత్కారం, స్పాంటినిటీతో ఎంతో మంది సినీ ప్రముఖుల జీవితాల్లోని ఎవరికీ తెలియని ఆసక్తికర కోణాలను, వారి అద్భుతమైన అనుభవాలను చిరు ఈ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు.
సినిమాపై మెగాస్టార్‌కు ఉన్న అపారమైన ప్రేమ, ఇండస్ట్రీ వర్గాలతో ఆయనకున్న విడదీయరాని బంధం ఈ టాక్ షోను మరో స్థాయికి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రేక్షకులతో ఆయనకున్న ఆప్యాయత ఈ కొత్త వేదికపై సరికొత్తగా ఆవిష్కృతం కానుంది. గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్, ఆటమ్ మీడియా వెంచర్స్, సోల్ ప్రొడక్షన్ ఎల్ఎల్పి (LLP) సంస్థలు సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ షో షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వెండితెరపై తన గ్రేస్‌తో మ్యాజిక్ చేసిన చిరంజీవి, ఇప్పుడు హోస్ట్‌గా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తారోనని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ బిగ్గెస్ట్ ఓటీటీ డెబ్యూకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్డేట్స్ త్వరలోనే బయటకు రానున్నాయి.
Also Read
- Tags
తాజావార్తలు
-
Chiranjeevi : నెట్‌ఫ్లిక్స్‌ను షేక్ చేయబోతున్న ‘చిరంజీవీస్ మెగావర్స్’!
-
YSRCP: పింఛన్ల పంపిణీపై వైసీపీ ఫిర్యాదు.. టీడీపీకి చెక్ పెట్టాలని డిమాండ్
-
Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
-
ఎక్సైజ్ కానిస్టేబుల్ సాహసం: అర కిలోమీటరు ఛేజ్ చేసి దొంగను పట్టుకున్న వైనం
-
Nara Rohith : త్రివిక్రమ్’పై ఆ ఒక్క కంప్లైంట్ ఉంది!
ట్రెండింగ్
-
Scalp Care Tips : చలికాలంలో చుండ్రు వేధిస్తోందా? ఈజీ అండ్ నాచురల్ చిట్కాలతో చెక్ పెట్టండిలా
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?