Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janhvi Kapoor: ఒకవైపు మన సౌత్ సినిమాలు దేశమంతా దుమ్మురేపుతుంటే, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మాత్రం ఇక్కడి మేకింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద రచ్చ లేపుతున్నాయి. కరణ్ జోహార్ షోలో పాల్గొన్న ఆమె, గతంలో ‘పెద్ది’ సినిమాలో తన పాత్రపై వచ్చిన బోల్డ్ సీన్ల వివాదం గురించి మాట్లాడుతూ సౌత్ డైరెక్టర్ల వర్కింగ్ స్టైల్‌నే టార్గెట్ చేశారు.
ఈ షోలో జాన్వీ మాట్లాడుతూ.. “సౌత్‌లో పక్కాగా రాసుకునే బౌండ్ స్క్రిప్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఏ సీన్ ఎక్కడి నుంచి తీస్తారు, కెమెరా ఎక్కడ పెడతారనేది ఆ స్క్రిప్టుల్లో అస్సలు ఉండదు. లొకేషన్‌కి వెళ్లాక డైరెక్టర్ ఏం చెబితే నటిగా అది చేయాల్సిందే. ఆ సీన్లు మరీ హద్దులు దాటకుండా నా వంతుగా ఎంత ఆపాలో అంత ఆపేందుకు చూశాను” అని చెప్పుకొచ్చారు. సౌత్ సినిమాల మేకింగ్‌ను ప్రపంచమంతా మెచ్చుకుంటున్న ఈ టైంలో జాన్వీ ఇలా మాట్లాడటం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
Also Read
అయితే అంతా డైరెక్టర్ల మీదే నెట్టేసి తాను సైడ్ అయిపోవాలని అనుకోవడం లేదని జాన్వీ క్లారిటీ ఇచ్చారు. “ఆ వివాదంలో నా వంతు బాధ్యత నాకూ ఉంది. అలాంటి సీన్లు సమాజంలో ఆడవాళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తలుచుకుంటే నాలో నేనే బాధపడుతుంటాను. ఆ రోజే కాస్త గట్టిగా మాట్లాడి ఆ సీన్లను ఆపేసి ఉండాల్సింది. ఆ గిల్ట్ నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఇకముందు ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటాను” అని చెప్పారు. తన తప్పును ఒప్పుకున్న తీరు బాగున్నప్పటికీ, సౌత్‌లో స్క్రిప్టే ఉండదన్నట్లు జాన్వీ మాట్లాడటంపై నెటిజన్లు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Janhvi Kapoor: ‘సౌత్‌లో స్క్రిప్ట్ ఉండదు.. కెమెరా ఎక్కడ పెడతారో తెలీదు’
-
Bangladesh: హసీనా ప్రభుత్వం కూలకముందే యూనస్‌తో చర్చలు.. పక్కా ప్లాన్‌తో రెజిమ్ ఛేంజ్?
-
KTR : పంటలు ఎండిపోతుంటే.. మూసీ సుందరీకరణ ఏంటి.?
-
Honey Trap పోలీసు అధికారులే టార్గెట్‌గా రూ.లక్షల్లో వసూళ్లు!
-
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
ట్రెండింగ్
-
Ragi Biscuits: ఓవెన్ లేకుండానే ఇంట్లో కరకరలాడే ‘రాగి బిస్కెట్లు’.. ఇలా చేస్తే పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారంతే..!
-
Rice Flour Poori Recipe: ప్రతీసారి గోధుమ పిండి పూరీలేనా?.. ఈ ఫెస్టివల్ సీజన్లో సాఫ్ట్ బియ్యప్పిండి పూరీలు ట్రై చేయండి..
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..