Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ కు మొదటి నుంచి సినిమాలు, ఫ్యామిలీ.. ఇవి తప్ప వేరే ప్రపంచం లేదు అన్నది అందరికి తెల్సిన విషయమే. ఇక మహేష్ ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాడు. ప్రముఖుల పుట్టినరోజులకు గుర్తుపెట్టుకొని విష్ చేస్తాడు. సినిమా నచ్చితే రివ్యూ ఇస్తాడు. ఇక సీతూ పాప, నమ్రతతో దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటాడు. ఇక ఈరోజు న్యూయర్ ను సెలబ్రేట్ చేసుకోవడానికి మహేష్.. కుటుంబంతో కలిసి వెకేషన్ కు వెళ్లిన విషయం తెల్సిందే. ఇక న్యూయర్ సెలబ్రేషన్స్ లోని ఒక అరుదైన ఫోటోను మహేష్ అభిమానులతో పంచుకుంటూ.. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాడు. భార్య నమ్రతను తన కౌగిలిలో బంధించిన ఫోటో అది.
ఇక ఈ ఫోటోను చూసిన అభిమానులు ఖలేజా సినిమాను గుర్తుచేసుకుంటున్నారు. అందులో అనుష్క ఏడుస్తుంటే.. మహేష్ ఓదార్చడానికి కౌగిలించుకుంటాడు.. ఇప్పుడు ఆ పోజ్ ను నమ్రతతో రీ క్రియేట్ చేసినట్లు కనిపిస్తుంది. ఇక ఈ ఫోటోను.. ఆ ఫోటోను పక్కపక్కన పెట్టి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రీల్ వర్సెస్ రియల్.. దేవుడు ఓదారుస్తున్నాడు.. కాదు తడిమేస్తున్నాడు అంటూ బ్రహ్మి, ఆలీ వాయిస్ లో చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే మహేష్ ప్రస్తుతం గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.