శర్వానంద్, సిద్ధార్ధ, అదితీరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’.. అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 14న థియేటర్స్ లో విడుదల కానుంది. ఇప్పటివరుకూ విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా మరో లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు.
‘హే తికమక మొదలే ఎదసొద వినదే అనుకుందే తడవా..’ అంటూ సాగే పాటను రెండు జంటల ప్రేమగీతంగా విడుదల చేశారు. శర్వానంద్ – అనూ ఇమ్మాన్యుయేల్, సిద్ధార్ధ – అదితీరావు హైదరిలతో ఈ సాంగ్ సాగింది. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించగా.. హరిచరణ్, నూతనా మోహన్ ఆలపించిన ఈ పాట ఆకట్టుకుంటోంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం ఈ చిత్రాన్ని నిర్మించారు.