Magadheera Movie Re Release : తెలుగు సినిమా చరిత్రలో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన అతి తక్కువ సినిమాల్లో రామ్ చరణ్ మగధీర సినిమా కూడా ఒకటి. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి హిట్ అయింది. అయితే ఇప్పటి యువత ఈ సినిమాను అప్పట్లో వయసు రీత్యా థియేటర్లలో మిస్ అయిన అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది సినిమా టీం. అదేమంటే ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరికీ ఒక రోజు ముందే పండగ రాబోతుందని ఒక ప్రకటన వెలువడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసి, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మగధీర సినిమాను గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది.
Rajesh Danda: 2025లో పాన్ ఇండియా సినిమా.. నిర్మాత రాజేష్ దండా ఇంటర్వ్యూ
అసలు విషయం ఏమిటంటే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందించిన మెగా బ్లాక్ బస్టర్ “మగధీర” చిత్రం మార్చి 26న థియేటర్లలో రీ రిలీజ్ కాబోతోంది. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ యర్రంశెట్టి రామారావు, అరిగెల కిషోర్ బాబు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక వారు మాట్లాడుతూ ఈ సినిమా భారీ స్థాయిలో అత్యధిక థియేటర్లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ చేస్తున్నామని, మమ్మల్ని ప్రోత్సహించి మాకు రీ రిలీజ్ చేసే అవకాశం కల్పించిన మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి కృతజ్ఞతలు అని అన్నారు. తెలుగు ప్రేక్షకులు మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించి రామ్ చరణ్ కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.