యంగ్ హీరో నితిన్ వరుస సినిమాలను లైన్లో పెట్టి జోష్ పెంచాడు. ‘మాస్ట్రో’ చిత్రం కొద్దిగా నిరాశపరచడంతో నితిన్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రంతో రెడీ అయిపోతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎం.ఎస్. రాజశేఖర్రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై సుధాకర్ రెడ్డి, నిఖితారెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నితిన్ సరసన ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి సందడి చేయనుంది.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించేసింది. ” ఈసారి థియేటర్ కే వచ్చేది బంపర్ మెజారిటీతో..” అంటూ ఏప్రిల్ 29 న సినిమా విడుదల కానున్నట్లు తెలిపారు. మరి ఈ సినిమా నితిన్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఈ సారి థియేటర్ కే వచ్చేది ✊🏻
— Sreshth Movies (@SreshthMovies) November 12, 2021
బంపర్ మెజారిటీతో..💥@actor_nithiin's #MacherlaNiyojakavargam 🔥
Releasing Worldwide in theatres on 𝐀𝐩𝐫𝐢𝐥 𝟐𝟗𝐭𝐡, 𝟐𝟎𝟐𝟐 🚩@IamKrithiShetty @SrSekkhar @mahathi_sagar #SudhakarReddy #NikithaReddy #RajkumarAkella @SreshthMovies pic.twitter.com/BH5jnyEf9H