Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Movie News M S Viswanathan Jayanthi Special

M. S. Viswanathan :’ఎమ్.ఎస్.వి.’ అంటే ‘మరపురాని స్వరాల విశ్వనాథన్’!

Updated On - 06:00 PM, Fri - 24 June 22
By subbarao n
M. S. Viswanathan :’ఎమ్.ఎస్.వి.’ అంటే ‘మరపురాని స్వరాల విశ్వనాథన్’!

ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన తెలుగువారిని విశేషంగా అలరించింది. ఆయన బాణీలతో పలు తెలుగు చిత్రాలు విజయపథంలో పయనించాయి. స్వరకల్పనతోనే కాదు తన గానమాధుర్యంతోనూ విశ్వనాథన్ అలరించారు. ఎమ్మెస్వీ నటుడు కావాలన్న అభిలాషను గమనించిన కొందరు ఆయనకు తగిన పాత్రలను కల్పించారు. ఎమ్మెస్వీ కీర్తి కిరీటంలో ఎన్నెన్నో ఆణిముత్యాలు నిలిచాయి. భౌతికంగా విశ్వనాథన్ లేకపోయినా, ఆయన సంగీతం మనలను సదా ఆనందింప చేస్తూనే ఉంటుంది. ఆయనే స్వరపరచినట్టు, “ఏ తీగె పువ్వునో… ఏ కొమ్మ తేటినో…కలిపింది ఏ వింత అనుబంధమౌనో…” – మళయాళ కుటుంబంలో పుట్టి, తమిళ చిత్రసీమలో రాణించి, తెలుగువారినీ విశేషంగా మురిపించారు ఎమ్మెస్వీ. అవును ‘ఏ నాటిదో ఈ సంగీతబంధం’. తలచిన ప్రతీసారి పులకింప చేస్తూనే ఉంటుంది.

మనయంగద్ సుబ్రమనియన్ విశ్వనాథన్ 1928 జూన్ 24న మళయాళ సీమలోని ఎలప్పుల్లి గ్రామంలో జన్మించారు. ఎమ్మెస్ విశ్వనాథన్ మాతృభాష మళయాళం. ఎమ్మెస్వీకి సంగీతంపై అభిలాష కలగడమే విచిత్రంగా సాగింది. నాలుగేళ్శ వయసులోనే విశ్వనాథన్ తండ్రిని కోల్పోయారు. దాంతో జైలర్ గా పనిచేస్తున్న మేనమామ పంచన చేరారు. థియేటర్ లో బఠాణీలు అమ్ముతూ, సినిమా పాటలు వింటూ సంగీతంపై అభిమానం పెంచుకున్నారు. ‘కణ్ణగి’ చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషించారు. పాఠశాలలో చదువుకొనే రోజుల్లో ఇంటికి పోతూ, రోజూ నీలకంఠ భాగవతార్ అనే ఆయన తన విద్యార్థులకు సంగీతం బోధిస్తూంటే చక్కగా వినేవారు ఎమ్మెస్వీ. కొద్ది రోజులకే హార్మోనియం వాయించడం నేర్చుకున్నారు. రాగయుక్తంగా పాడుతూ, అందుకు తగ్గట్టుగా హార్మోనియం వాయిస్తూ ఉంటే నీలకంఠ భాగవతార్ చూశారు. ఎమ్మెస్వీలో అద్భుతమైన కళకారుడు ఉన్నాడని గుర్తించి, విశ్వనాథన్ 13వ యేటనే మూడు గంటల పాటు హార్మోనియం వాయిస్తూ పాటలు పాడేలా ఏర్పాటు చేశారు. తరువాత మద్రాసు చేరి జూపిటర్ సంస్థలో ఆఫీస్ బోయ్ గా పనిచేశారు ఎమ్మెస్వీ. తొలుత ఎస్.ఎమ్.సుబ్బయ్యనాయుడు వద్ద శిష్యరికం చేసి, తరువాత సి.ఆర్.సుబ్బురామన్ దగ్గర హార్మోనియం ప్లేయర్ గా చేరారు.

సుబ్బురామన్ దగ్గరే టి.కె.రామ్మూర్తితో పరిచయం ఏర్పడింది. సి.ఆర్.సుబ్బురామన్ స్వరకల్పన చేసిన “రత్నమాల, లైలా-మజ్ను, చండీరాణి” చిత్రాలకు విశ్వనాథన్-రామ్మూర్తి ఇద్దరూ సహాయకులుగా పనిచేశారు. ‘దేవదాస్’ చిత్రంలోని అన్ని పాటలకూ స్వరకల్పన చేసిన సుబ్బురామన్ హఠాన్మరణంతో అందులోని “జగమే మాయ… బ్రతుకే మాయ…” పాటకు విశ్వనాథన్-రామ్మూర్తి బాణీలు కట్టడం విశేషం. ఆ తరువాత విశ్వనాథన్ – రామ్మూర్తి సంగీత ద్వయం తమిళ, తెలుగు, మళయాళ భాషల్లో జైత్రయాత్ర చేసింది. ఆ నాటి ప్రముఖ గాయనీగాయకులతో మొట్టమొదటిసారి లైవ్ పెర్ ఫామెన్స్ ఇచ్చిన ఘనత విశ్వనాథన్- రామ్మూర్తి ద్వయానిదే! ఆ ట్రెండ్ ను ఉత్తర దక్షిణ సంగీత దర్శకులెందరో అనుసరించడం విశేషం!యన్టీఆర్ ‘సంతోషం’, ‘తెనాలి రామకృష్ణ’, ‘ఇంటికి దీపం ఇల్లాలే’, ‘మంచి-చెడు’, ‘ఆడబ్రతుకు’, ‘కర్ణ’ వంటి చిత్రాలకు విశ్వనాథన్- రామ్మూర్తి సమకూర్చిన సంగీతం తెలుగువారిని విశేషంగా అలరించింది. నూరు చిత్రాలకు కలసి సంగీతం సమకూర్చిన తరువాత కొన్ని అనివార్య కారణాల వల్ల విశ్వనాథన్, రామ్మూర్తి విడిపోయారు.

ఎమ్మెస్వీ సోలోగానూ అనేక మ్యూజికల్ హిట్స్ అందించారు. వాటిలో “లేతమనసులు, మనసే మందిరం, భలే కోడలు, సత్తెకాలపు సత్తెయ్య, సిపాయి చిన్నయ్య, అంతులేని కథ, చిలకమ్మ చెప్పింది, మరో చరిత్ర, సింహబలుడు, అందమైన అనుభవం, ఇదికథ కాదు, గుప్పెడు మనసు” వంటివి చోటు చేసుకున్నాయి. యన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘సమ్రాట్ అశోక’కు కూడా ఎమ్మెస్వీ స్వరకల్పన చేయడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ చిత్రాలకు సంగీతం సమకూర్చి అలరించిన ఎమ్మెస్వీ నిజజీవితంలో ఎంతో సౌమ్యుడు. తన దరికి చేరిన వారికి ఆశ్రయం కల్పిస్తూ వచ్చారు. విశ్వనాథన్ బాణీలతోనే ఎల్.ఆర్.ఈశ్వరి ఎంతో పేరు సంపాదించారు. పలువురు గీత రచయితలకు కూడా ఎమ్మెస్వీ బాణీలే వారి ఉనికిని చాటాయి. మిత్రుడు రామ్మూర్తితో కలసి వందకు పైగా చిత్రాలకు స్వరకల్పన చేసిన ఎమ్మెస్వీ, సోలోగా ఏడు వందల పై చిలుకు సినిమాలకు బాణీలు కట్టారు.

మెలోడీ కింగ్ గా పేరొందిన ఎమ్మెస్ విశ్వనాథన్ ను తమిళులు అభిమానంతో ‘మెల్లిసై మన్నార్’ అని పిలుచుకుంటారు. ఎమ్మెస్వీని ‘తిరై ఇసై చక్రవర్తి’ అని ఆ నాటి ముఖ్యమంత్రి జయలలిత సన్మానించి, అరవై బంగారు నాణ్యాలు బహూకరించారు. 2015 జూలై 14న లోకం విడిచిన ఎమ్మెస్ విశ్వనాథన్ బాణీలు మాత్రం మనలను మరో లోకాల్లో విహరింప చేస్తూనే ఉన్నాయి.

  • Tags
  • latest updates
  • Legendary Music Director MS Viswanathan
  • M. S. Viswanathan
  • Viswanathan
  • Viswanathan jayanthi

RELATED ARTICLES

Live: 60 లక్షల బిల్లు.. ఇద్దరు పిల్లల మృతి | Rainbow Hospitals| Ntv

Tollywood : ‘కొండా’తో కలిపి ఈ వారం తొమ్మిది!

Kosaraju Raghavaiah Chowdary : జానపద కవిరత్న… కొసరాజు!

B.V.S.Ravi : ఆహా అనిపిస్తున్న మచ్చరవి!

Live : డబ్బు మదమా..! తినే తిండి ప్రభావమా..? పబ్ లో యువతిపై దాడి..! మళ్లీ బడా బాబుల పిల్లలే..! |

తాజావార్తలు

  • RAJIV SWAGRUHA FLATS: నేటి నుంచి షురూ.. ఫేస్‌బుక్‌, యూట్యూట్‌లో లాటరీ లైవ్ స్ట్రీమింగ్

  • Agneepath Scheme: 3 రోజుల్లో ‘అగ్నిపథ్‌’ స్కీంకు వచ్చిన దరఖాస్తులు ఎన్నంటే..?

  • Astrology: జూన్ 27, సోమవారం దినఫలాలు

  • Maharashtra Political Crisis:సుప్రీంకోర్టుకు చేరిన “మహా” రాజకీయం..నేడు విచారణ

  • Live: ఈ రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే అపర కుబేరులవుతారు

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions