ఎమ్.ఎస్.విశ్వనాథన్ స్వరకల్పన తెలుగువారిని విశేషంగా అలరించింది. ఆయన బాణీలతో పలు తెలుగు చిత్రాలు విజయపథంలో పయనించాయి. స్వరకల్పనతోనే కాదు తన గానమాధుర్యంతోనూ విశ్వనాథన్ అలరించారు. ఎమ్మెస్వీ నటుడు కావాలన్న అభిలాషను గమనించిన కొందరు ఆయనకు తగిన పాత్రలను కల్పించారు. ఎమ్మెస్వీ కీర్తి కిరీటంలో ఎన్నెన్నో ఆణిముత్యాలు నిలిచాయి. భౌతికంగా విశ్వనాథన్ లేకపోయినా, ఆయన సంగీతం మనలను సదా ఆనందింప చేస్తూనే ఉంటుంది. ఆయనే స్వరపరచినట్టు, “ఏ తీగె పువ్వునో… ఏ కొమ్మ తేటినో…కలిపింది ఏ వింత అనుబంధమౌనో…”…