తమిళ సినిమా నిర్మాణ సంస్థల్లో భారీ చిత్రాలు నిర్మించే సంస్థగా పేరున్న ప్రొడక్షన్స్ లో ఒకటి ‘లైకా ప్రొడక్షన్స్’. పొన్నియన్ సెల్వన్, రోబో 2.O, దర్భార్ వంటి భారీ సినిమాలు నిర్మిచిన లైకా భారీ సినిమాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది. కానీ సినిమాల హిట్ పర్సెంట్ పరంగా చుస్తే చాలా తక్కువ అనే చెప్పాలి. ముఖ్యంగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ తో తీసిన భారతీయుడు 2, రోబో 2.O వంటి సినిమాలు వలన భారీ నష్టాలు చూసింది లైకా. లాల్ సలామ్, భారతీయుడు 2 ఈ సంస్థను కోలుకోలేని దెబ్బ తీశాయి. సినిమా రంగం నుండి తప్పుకోవాలని కూడానా అనుకుంది లైకా.
Also Read : Court : నిర్మాత నానికి లాభాలు తెచ్చిపెట్టిన కోర్ట్.. 3 డేస్ కలెక్షన్స్ ఎంతంటే..?
ఆ రెండు సినిమాల నష్టాల కారణంగా ప్రస్తుతం లైకా నిర్మించిన భారీ యాక్షన్ సినిమా ‘L2 ఎంపురాన్’ కోసం చేతులు చాపాల్సిన పరిస్థితి వచ్చింది. మలయాళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన బిగ్గెస్ట్ హిట్ సినిమా లూసిఫర్. ఆ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న L2 ఎంపురాన్ ను నిర్మించింది లైకా. ఈ సినిమాను ఫినిష్ చేయలేక ఆర్థిక మద్దతు కోసం ఇతరుల సాయం కోరిన లైకాను జెమిని ఫీల్మ్ సర్క్యూట్స్, గోకులం సినిమాస్ వంటి సంస్థలు ఆదుకోవడంతో ఎంపురాన్ వర్క్ కంప్లిట్ చేసుకుని ఈ నెల 27న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కు రెడీ అయింది. కానీ రిలీజ్ విషయంలోను మరోసారి ఇబ్బందులు ఎదుర్కొంటోంది లైకా. ఈ నేపథ్యంలో లైకా నుండి మొత్తం రైట్స్ కొనుగోలు చేసి గోకులం గోపాలన్ రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఆశీర్వాద్ సినిమాస్ ద్వారా రిలీజ్అవుతుంది. తెలుగులో దిల్ రాజు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అలాగే లైకాను నిర్మాణ రంగం నుండి తప్పుకోవద్దని తాము అండగా ఉంటామని కూడా భరోసా ఇచ్చాడట గోకులం గోపాలన్. ఏదేమైనా ఒకప్పడు వందల కోట్ల బడ్జెట్ సినిమాలు లైకా ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవడం బాధాకరం.