ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ విన్నర్ కెవిన్ స్పేసీపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ‘ద యూస్‌వల్ సస్పెక్ట్స్’, ‘అమెరికన్ బ్యూటీ’ చిత్రాలకు గానూ రెండు సార్లు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఈ నటుడు గత కొన్నేళ్లుగా లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అయితే ఇతను లైంగికంగా వేధించింది అమ్మాయిలను కాదు అబ్బాయిలను.. ముగ్గురు పురుషులపై నాలుగు సార్లు లైంగిక దాడికి పాల్పడినట్టు కెవిన్ పై ఆరోపణలు ఉన్నాయి. ఇక తాజాగా ఈ ఆరోపణలు బలంగా ఉండడంతో మే 26న బ్రిటన్ పోలీసులు ఛార్జిషీటును దాఖలు చేశారు. పురుషులకు ఇష్టం లేకుండా బలవంతంగా లైంగిక దాడికి పాల్పడడం చట్టరీత్యా నేరమని తెలుపుతూ అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మొదటిసారి లండన్ లో ఓ వ్యక్తిని రెండుసార్లు లైంగిక వేధింపులకు గురిచేశాడు. అదే సమయంలో మీటూ ఉద్యమం మొదలవ్వడంతో మొదటిసారి ఆయనపై లైంగిక ఆరోపణలు నమోదయ్యాయి. ఇక ఆ తరువాత లండన్‌లోనే 2008, ఆగస్టులో రెండో వ్యక్తితో మూడో సారి లైంగిక చర్యలో పాల్గొన్నాడు. ఇంగ్లాండ్‌లో 2013, ఏప్రిల్‌లో మూడో వ్యక్తితో నాలుగోసారి శృంగారంలో పాల్గొన్నాడు. ఈ విషయాన్నీ ద క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ తెలిపింది. కెవిన్ ముగ్గురు వ్యక్తులతో నాలుగుసార్లు లైంగిక చర్యలో పాల్గొన్నాడని, అందులో ఒక వ్యక్తిపై వేధింపులకు పాల్పడ్డాడని.. ఇద్దరు వ్యక్తులతో శృంగారం జరిపినట్లు తెలిపారు.ఇక ఈ ఆరోపణలను కెవిన్ తోసిపుచ్చడం గమనార్హం.