Lokesh Kanagaraj : స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కూలీ సినిమాతో రీసెంట్ గానే పలకరించారు. రజినీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో నాగార్జున విలన్ గా చేయగా.. అమీర్ ఖాన్, ఉపేంద్ర కీలక పాత్రల్లో మెరిశారు. ఇప్పటికే సినిమా రూ.400 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ మూవీ లోకేష్ సినిమాల స్థాయిలో లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో సినమాల ఇజయాలపై లోకేష్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సినిమాలకు వందల కోట్లు వస్తేనే సక్సెస్ కాదు. అలాంటి సినిమాలు మాత్రమే చేయాలంటే కుదరదు. కొన్ని సినిమాలు అంతకు మించిన విలువను పెంచుతాయి అన్నాడు.
Read Also : Kannappa : కన్నప్ప ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
నేను సినిమాలు తీయాలనుకున్నప్పుడు నా దగ్గర ఏమీ లేవు. ఓ ఫిల్మ్ మేకర్ వద్ద పనిచేయాలనే కోరిక నెరవేరలేదు. నా సినిమాలకు ఎవరిని తీసుకోవాలో నా ఇష్టపూర్వకంగానే తీసుకుంటా. నా సినిమాలకు అనిరుధ్ ఓ ప్లస్ పాయింట్. అతను లేకుంటే నేను అస్సలు సినిమాలు చేయను. ఒకవేళ అతను రిటైర్ అయిపోతే ఏఐ మీద ఆధారపడుతానేమో గానీ.. వేరే వాళ్లతో చేయను. కాకపోతే దానికి ఇంకా టైమ్ ఉంది అంటూ సంచలన ప్రకటన చేశాడు లోకేష్. మనకు తెలిసిందే కదా.. లోకేష్ ప్రతి సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కూలీకి అతను ఇచ్చిన బీజీఎం బాగా వర్కౌట్ అయింది.
Read Also : Nani : జున్ను కాలు ఫ్రాక్చర్ అయింది.. నాని ఎమోషనల్