Dil Raju Comments on Family Star Goes Viral: విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి ఆ సినిమా నిర్మాత దిల్ రాజు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ ఇన్సూరెన్స్, ఐడి కార్డుల డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి దిల్ రాజుతో పాటు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ నేపథ్యంలో దిల్ రాజు మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమాకి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్ పెట్టినప్పుడు కావాలని విజయ్ దేవరకొండని ఒక స్టార్ గా నిలబెట్టే ప్రయత్నంగా ఈ టైటిల్ పెట్టామని ప్రచారం చేశారు. కానీ అది నిజం కాదని చెప్పుకొచ్చారు.
Pawan Kalyan: పిఠాపురం నుంచి జనసేన అధినేత ప్రచారం..
ఇప్పటివరకు నేను ఈ విషయం రివిల్ చేయలేదు ఇప్పుడే చెబుతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఎక్కడో ఉన్న మీ ఫ్యామిలీని మరో మెట్టుకు తీసుకువచ్చేందుకు కష్టపడే ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ స్టార్స్ అనేది ఈ సినిమా కంటెంట్ అంటూ ఆయన ఫ్యామిలీ స్టార్ లైన్ చెప్పేశారు. నేను ఎక్కడో మారుమూల ప్రదేశం నుంచి వచ్చి నా రంగంలో కష్టపడి ఇప్పుడు నా కుటుంబాన్ని ఒక బాధ్యతాయుతమైన స్థానంలో నిలబెట్టాను, అలా కుటుంబాన్ని మరో మెట్టు ఎదిగేలా చేసిన నేనైనా మీరైనా ఫ్యామిలీ స్టారే అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకానీ విజయ్ దేవరకొండని స్టార్ట్ చేయాలని ప్రయత్నం అయితే ఇది కాదు, దిల్ రాజు బ్రాండ్ నుంచి ఒక కుటుంబ కథ చిత్రం వస్తే ఎలా ఉంటుందో ఈ ఫ్యామిలీ స్టార్ సినిమా కూడా అలాగే ఉంటుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఈ ఫ్యామిలీ స్టార్ మూవీని పరశురాం డైరెక్ట్ చేస్తుండగా విజయ్ దేవరకొండ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.