Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన సంగతి తెల్సిందే. ఒక సినిమా తరువాత ఒక సినిమా చేస్తూ.. త్వరత్వరగా సినిమాలను ఫినిష్ చేస్తున్నాడు. ఇప్పటికే ఉస్తాద్, బ్రో షూటింగ్స్ లో బిజీగా ఉన్న పవన్ తాజాగా హరిహర వీరమల్లు షూటింగ్ ను కూడా మొదలుపెట్టనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న చిత్రం హరిహర వీరమల్లు. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దాదాపు 80 శాతం షూటింగ్ ను పవన్ పూర్తి చేశాడు. క్లైమాక్స్ మాత్రమే బాకీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఆ క్లైమాక్స్ ను పూర్తిచేయడానికి పవన్ రెడీ అయ్యాడట.
Priyanka Chopra: నా అండర్ వేర్ చూడాలని, వారికి చూపించమని డైరెక్టర్ వేధించాడు..
కొన్ని నెలలు వీరమల్లు కు గ్యాప్ ఇచ్చి.. ఉస్తాద్, బ్రో ను పట్టాలెక్కించిన పవన్.. జూన్ లో వీరమల్లు క్లైమాక్స్ లో అడుగుపెట్టనున్నాడట. జూన్ మొదటి వారంలో హైదరాబాద్లోని ఓ ఫేమస్ స్టూడియోలో వేసిన సెట్లో హరిహర వీరమల్లు కొత్త షెడ్యూల్ మొదలుకానున్నదట. క్లైమాక్స్ కాబట్టి యాక్షన్ సన్నివేశాలు మెండుగా ఉండనున్నాయని టాక్. దాదాపు పది రోజులు ఈ షూటింగ్ జరగనున్నదట. ఇక ఈ వార్త తెలియడంతో పవన్ అభిమానులు పవన్ స్పీడ్ కు ముగ్దులైపోతున్నారు. ‘బ్రో’.. నీ స్పీడుకు బ్రేకుల్లేవ్ ఇక అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి హరిహర వీరమల్లుతో డైరెక్టర్ క్రిష్ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.