యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాధేశ్యామ్. మార్చి 11 న రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా మంచి వసూళ్లనే అందుకుంటుంది. ఇక ఈ సినిమా హిట్.. ఫట్ పక్కన పెడితే.. ఈ సినిమా వలన ఎవరికి ఉపయోగం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి సినిమా హిట్ , ప్లాప్ లతో సంబంధం లేదు.. ఇక పూజా సైతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఈ సినిమా తరువాత మంచి అవకాశాలు వస్తాయి అని అనుకోవడానికి లేదు.. ఇకపోతే ప్రస్తుతం అందరి దృష్టి డైరెక్టర్ రాధా కృష్ణ, సీనియర్ నటి భాగ్యశ్రీ పైనే ఉంది. జిల్ సినిమాతో హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ టౌపరి సినిమానే ప్రభాస్ తో అవకాశం.. ఇక ఆ సినిమా.. చిన్న సినిమాగా మొదలై భారీ బడ్జెట్ సినిమాగా మారింది. ఇక వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చి చివరికి బాక్సాఫీస్ వద్ద బోర్లాపడింది.
నాలుగేళ్లు ఒక సినిమా కోసం ఎదురుచూసిన ఈ డైరెక్టర్ కి నెక్స్ట్ ఏ హీరో ఛాన్స్ ఇస్తాడో చూడాలి. ఇక ప్రభాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకున్న సీనియర్ నటి భాగ్యశ్రీ ఆశలు అడియాశలుగా మారాయి. భాగ్యశ్రీ ఈ సినిమాలో ప్రభాస్ తల్లి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి బాలీవుడ్ లో ఫేమస్ అయిన ఈమెను తీసుకుంటే కాస్తా కలిసొస్తుందని మేకర్స్ భావించి.. ప్రభాస్ తల్లిగా ఆమెను చూపించారు. అయితే భాగ్యశ్రీ కి ఈ సినిమాలో దక్కిన ప్రాముఖ్యత చాలా తక్కువ అంటూ ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ రేంజ్ ని చూసి తనకు కూడా ఎంతోకొంత పేరు వస్తుంది అనుకున్న ఆమెకు ప్రస్తుతం దక్కింది ఏంటి..? నటన ప్రతిభ కనబర్చేంతగా నటించేందుకు కూడా ఆ పాత్రలో స్కోప్ కనిపించలేదు. చివరికి అందరిలానే ఈమె కూడా సినిమాలో అలా వచ్చి ఇలా వెళ్లిపోయేదే తప్ప గుర్తుంచుకునే పాత్ర కాదని, ఇకముందైనా పాత్రలను మంచిగా ఎంచుకోవాలని ఆమె అభిమానులు హితబోధ చేస్తున్నారు.