NTR: ఆర్ఆర్ఆర్ రిలీజ్ అయ్యి దగ్గదగ్గర సంవత్సరం కావొస్తోంది. ఆ సినిమా తరువాత రామ్ చరణ్ వరుసగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు.. లైన్లో పెట్టడం కాదు సెట్స్ మీదకు తీసుకెళ్లి దాదాపు పూర్తి చేసేస్తున్నాడు. రాజమౌళి.. మహేష్ తో సినిమాను అనౌన్స్ చేశాడు.. కథను సిద్ధం చేసే పనిలో కూడా పడ్డాడు. అలియా.. పెళ్లి చేసుకొని పిల్లను కూడా కనింది. కానీ, ఒక్క ఎన్టీఆర్ మాత్రమే ఇంకా ఒక్క సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లలేదు. కొరటాల శివ దర్శకతంలో ఎన్టీఆర్ 30 అనౌన్స్ చేయడం జరిగింది.. దాన్ని నుంచి కొత్త పోస్టర్.. రిలీజ్ డేట్ రిలీజ్ చేయడం కూడా జరిగాయి. కానీ, ఇంకా సినిమా సెట్స్ మీదకు కూడా వెళ్ళలేదు. ఆచార్య ప్లాప్ తో కొరటాల.. ఈ కథకు రంగులు దిద్దుతున్నాడు.. మెరుగులు అద్దుతున్నాడు అంటూ ఇన్నిరోజులు డిలే చేస్తూ వచ్చారు. ఇక గతేడాది చివర్లో స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది.. మొదలవుతుంది అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ను ఊరించారు. దీంతో మహా సంతోషంలో అభిమానులు గెంతులు కూడా వేశారు.
Anasuya: ఆ నడుము మడతలతోనే కుర్రాళ్లను మడతపెట్టేస్తోందే
కొత్త ఏడాది వచ్చింది.. మొదటి నెల కూడా అయిపోయింది ఇంకా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకోలేదు. ఇక మొన్నటివరకు ఈ సినిమాను కొరటాల ఆపుతూ వచ్చాడని వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడేమో ఎన్టీఆర్ వలనే డిలే అవుతుందని వార్తలు హోరెత్తిపోతున్నాయి. కొరటాల ఫుల్ స్క్రిప్ట్ ను పూర్తిచేసి.. ఎన్టీఆర్ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాడట. ఎన్టీఆర్ ఫైనల్ స్క్రిప్ట్ ను చదివి ఓకే అనడం ఆలస్యం పూజా, వెంటనే షూటింగ్ షురూ చేయడమేనట. ఇక ఈ వార్త విన్న అభిమానులు ఏం అన్నా.. నువ్వు కూడా మాకు ఇంత అన్యాయం చేస్తావా..? అందరి హీరోల అభిమానులు తమ హీరోల పోస్టర్స్, సినిమా అప్డేట్స్ వచ్చాయని సంబరపడుతుంటే.. మేము మాత్రమే ఇలా ఉంటున్నాం. త్వరగా కథను ఓకే చేసి సెట్స్ మీదకు తీసుకెళ్ళు అన్నా అంటూ కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ ఎందుకు ఇంత జాగు చేస్తున్నాడో తెలియాల్సి ఉంది.