Anasuya: బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న అనసూయ.. షోలకు కొద్దిగా గ్యాప్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళంలో కూడా అమ్మడు వరుస అవకాశాలను అందుకొంటూ జోరుపెంచేసింది. ఇక షోలు లేకపోతేనేం.. సోషల్ మీడియా ఉందిగా.. అనసూయ అభిమాన గళం మొత్తం అందులోనే ఉంటారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో అనసూయ చేసే రచ్చ అంతా ఇంత కాదు. ఇక వాటికి ట్రోలర్స్ ట్రోల్స్ చేస్తారు.. వాటి గురించి పెద్దగా పట్టించుకోని ముద్దుగుమ్మ తన పని తానూ చేసుకుంటూ పోతోంది. ఇక అనసూయ అందచందాల గురించి, అందాల ఆరబోత గురించి అసలు చెప్పనవసరం లేదు.
చీరకట్టినా, మోడ్రన్ డ్రెస్ వేసినా అందాల ఆరబోత ఉండాల్సిందే. తాజాగా హాట్ యాంకర్ నీలం రంగు చీరలో తళుక్కున మెరిసింది. బ్యాక్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ గుండెలను గుభేలు అనిపించింది. ఆ వీపందం తో పాటు ఆ నడుము మడతలను చూపిస్తూ పిచ్చెక్కించింది. ఈ రేంజ్ లో అనసూయ అందం చూసిన నెటిజన్లు ఊరకనే ఉంటారా.. ఈ ఫోటోలను వైరల్ చేసి పడేసారు. నీలి రంగు చీరలోనా చందమామ నువ్వే జాణ అని కొందరు పొగిడేస్తుంటే.. ఆ నడుము మడతలతోనే కుర్రాళ్లను మడతపెట్టేస్తోందే అని మరికొందరు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ మైఖేల్, పుష్ప 2 చిత్రాల్లో నటిస్తోంది.