పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “భీమ్లా నాయక్”. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో రానా, బిజు మీనన్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త కథానాయికలుగా నటిస్తున్నారు. బుధవారం “భీమ్లా నాయక్” అప్‌డేట్ ఉంటుందని చిత్రనిర్మాతలు ప్రకటించినప్పటి నుండి అభిమానులు సోషల్ మీడియాలో #BheemlaNayak అనే హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఆ అప్డేట్ రానే వచ్చింది. అప్డేట్ ఏమిటంటే అభిమానుల కోసం “భీమ్లా నాయక్” నుంచి ట్రీట్ ను ప్లాన్ చేశారు మేకర్స్. “లాలా భీమ్లా” వీడియో సాంగ్ ప్రోమో ఈరోజు సాయంత్రం 07:02 గంటలకు విడుదలవుతుందని ప్రకటిస్తూ, “ఈ దీపావళిని #TheSoundOfBheemlaతో జరుపుకుందాం. అంటూ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ లో పవన్ కళ్యాణ్ నుదుటిపై తిలకం దిద్దుకుని, ముందర మందు బాటిల్ పెట్టుకుని కన్పించారు.
Read Also : అఫిషియల్ : “మేజర్” రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసిన మహేష్
ఈ చిత్రం 2022 జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రీమేక్‌కి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించనున్నారు. ముఖ్యంగా పవన్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా మేకర్స్ ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు కాబట్టి ఈ రీమేక్ ఎలా ఉంటుందో చూడాలి.