L2 Empuraan : మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ ఎల్-2 ఎంపురాన్. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పటికే మళయాలంలో అత్యధిక వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ సినిమాను లూసీఫర్ కు సీక్వెల్ గా తీశారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఆకట్టుకుంది. ఇందులో మలయాళ డైరెక్టర్ టొవినో థామస్ కూడా కీలక పాత్రలో నటించారు. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ మూవీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Read Also :Ilaya Raja: ఈ ఏజ్‌లో సంగీతం చేయకూడదా?
ఈ మూవీ 30 రోజుల్లో రూ.325 కోట్లు వసూలు చేసిందని మూవీ టీమ్ ప్రకటించింది. మళయాల సినిమా చరిత్రలో ఈ సినిమాదే అత్యధిక కలెక్షన్లు అని మోహన్ లాల్ ట్వీట్ చేశారు. ఈ సినిమాతో మళయాల ఇండస్ట్రీ ఓ వెలుగు వెలుగుతుందని ఆయన రాసుకొచ్చారు. ఈ సినిమా మళయాలంలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన మళయాల సినిమాగా నిలిచింది. దీనికి మూడో పార్టు కూడా వస్తుందనే టాక్ ఉంది.