రూపేష్, ఆకాంక్షా సింగ్ హీరో, హీరోయిన్లుగా, ‘లేడీస్ టైలర్’ కపుల్ రాజేంద్రప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులుగా పవన్ ప్రభ దర్శకత్వంలో మా ఆయి ప్రొడక్షన్స్ పతాకంపై రూపేష్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం‘షష్టిపూర్తి’. ఈ సినిమాకి వున్న మరో ప్రత్యేకత ఏమిటంటే, ఈ చిత్రానికి విశ్వవిఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రాన్ని త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం టీజర్ విడుదల కార్యక్రమం శనివారం నాడు హైదరాబాద్‌లోని ఆర్.కె. సినీ మాక్స్.లో జరిగింది. సంగీత దర్శకుడు ఇళయరాజా, ఈ చిత్రంలోని ‘ఏదో ఏదేదో’అంటూ సాగే ఒక పాటకు లిరిక్స్ అందించిన మరో సంగీత దర్శకుడు కీరవాణి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో సంగీత దర్శకుడు ఇళయరాజా మాట్లాడుతూ, ‘‘ఈ ఏజ్‌లో కూడా ఇలా సంగీతం చేస్తున్నారే అంటున్నాడు రాజేంద్రప్రసాద్.. ఈ ఏజ్‌లో సంగీతం చేయకూడదా? ఎలా చేస్తున్నారే అంటే పర్లేదు.. ఇలా చేస్తున్నారేంటి అంటున్నారు… చేయకూడదా రాజేంద్రపసాద్.. వీడు మావాడే.. వీడు వంశీ.. ఇలా ఒక గ్రూప్ వుండేది. వాళ్ళందరూ నా నా కంపోజింగ్ రూమ్ ముందు గలాటా చేసేవారు. నేను ఇక్కడకి వచ్చింది మాట్లాడ్డానికి కాదు. మాట్లాడానికి ఏమీ లేదు. ఈ సినిమాకి నేను చేసిన వర్క్ మీరు విన్నారు… వినబోతున్నారు.. వింటూనే వుంటారు.. ఆ నమ్మకం వుంది.
Gymkhana : బాలయ్య ఫ్యాన్స్ పై డైలాగ్.. జింఖానా తెలుగు ట్రైలర్ రిలీజ్..
కీరవాణి రాసిన పాట పల్లవి వినిపించినప్పుడు, కీరవాణి తన మనసులో నామీద వున్న ఆత్మ బంధాన్ని రాశారని నాకు అర్థమైంది. నా మీద వున్న అభిమానం కీరవాణిలో ఎప్పుడూ మారలేదు. సంగీత దర్శకుడు అవడానికి ముందు, సంగీత దర్శకుడిగా పాపులర్ అయిన తర్వాత కూడా ఆయనకు నా మీద అభిమానం అలాగే వుంది. దేవుడు ఈ సినిమాకి, ఈ సినిమాకి పనిచేసిన అందరికీ ఆశీస్సులు అందించాలి. లాంగ్ లైఫ్ ఫేమ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. మీరు చేసిన వేలాది పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏది అని అడిగితే, ‘ఒకటా.. రెండా… నేను నాకు ఎంత సంగీతం తెలుసన్నది ముఖ్యం కాదు.. సంగీతమే నాకు గురించి తెలుసుకుంది. నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు తెలియదు. ఆ సంగతి తెలిసిన మరుక్షణంలోనే నేను సంగీతాన్ని ఆపేస్తాను… నాకు నాలోంచి సంగీతం ఎలా వస్తోందో నాకు ఎప్పటికీ తెలియకూడదని దేవుడిని కోరుకుంటున్నాను. నేను ఆడియో రిలీజ్ ఫంక్షన్లలో పాల్గొనేది చాలా తక్కువ. ‘షష్టిపూర్తి’ సినిమా ద్వారా కొత్తవాళ్ళు, మొదటి ప్రయత్నంచేస్తున్నారు. వారిని ప్రోత్సహించాలనే ఇక్కడకి వచ్చాను. ఈ సినిమా చేస్తున్న కొత్తవారిని ప్రోత్సహించడానికే వచ్చాను’’ అన్నారు.