L.Vijayalakshmi: అలనాటి నటి, నర్తకి ఎల్. విజయ లక్ష్మి గురించి ఈతరానికి తెలియకపోవచ్చు.. కానీ ఆ తరానికి ఆమె ఒక ఆరాధ్య దైవం. ఆమె నర్తించని సినిమా అసలు సినిమానే కాదు అనుకొనేవారట. స్టార్ హీరోలు ఆమెతో డ్యాన్స్ చేయడం కోసం ఉబలాటపడేవారట. పెళ్లి తరువాత ఆమె అమెరికాలో సెటిల్ అయ్యిపోయారు. ఎన్నో ఏళ్ళ తరువాత ఆమె ఆలీ నిర్వహించే టాక్ షోకు హాజరయ్యారు. ఒక తెలుగు టాక్ షో కోసం సప్త సముద్రాలు దాటి వచ్చిన ఘనత ఎల్. విజయ లక్ష్మి ది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఐదేళ్లకే ఆమె టీవీలో ఏ నాట్యం చూస్తే ఆ నాట్యాన్ని వెంటనే ఇంటికి వచ్చి చేసేవారట. తనకు సాంగ్ వినిపిస్తే చాలు డ్యాన్స్ ఆటోమేటిక్ గా వస్తుందని చెప్పుకొచ్చింది.
ఇక ఎన్టీఆర్ తనను కోడలా కోడలా అని పిలిచేవారని, ఆయన నటించిన గుండమ్మ కథలో తన సాంగ్ లేకుండా షూటింగ్ జరిగిందని, తనతో ఒక్క పాట అయినా చేయించాలని సాంగ్ లేకుండా కేవలం మ్యూజిక్ తోనే సాంగ్ పెట్టించారని చెప్పుకొచ్చింది. ఇక పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయిన ఆమె ఈ జనరేషన్ హీరోలు నటించిన ఏ సినిమా చూసారు అని అడుగగా.. పుష్ప అని చెప్పింది. అయితే ఆయన ఎవరో తెలుసా..? అని అడుగగా తెలియదు అని చెప్పింది. అందుకు ఆలీ.. అల్లు రామలింగయ్య గారి మనవడు అని చెప్పగా.. ఈ మధ్యకాలంలో హీరోల గురించి అడుగుతుంటే రామానాయుడు మనవడు.. ఎన్టీఆర్ మనవడు అని చెప్తున్నారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.