Khushi: లైగర్ తరువాత విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ఖుషీ. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. ఇక ఈ సినిమానుమైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. నా రోజా.. నువ్వే అంటూ సాగె సాంగ్ ను మే 9 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా దాంతో పాటు ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో సమంతను హాగ్ చేసుకొని విజయ్ నవ్వులు చిందిస్తూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది.
Karnataka Elections: కర్ణాటకలో బ్రహ్మానందం ప్రచారం.. ఏ పార్టీ తరుపున అంటే..?
ఇక మలయాళంలో హృదయం సినిమాకు సూపర్ మ్యూజిక్ అందించారు అబ్దుల్ వహాబ్.. ఈ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కాబోతున్నాడు. ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఒకపక్క లైగర్ తో దెబ్బ తిన్న విజయ్ .. ఇంకోపక్క శాకుంతలంతో దెబ్బ తిన్న సామ్.. హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. లవ్ స్టోరీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన శివ నిర్వాణ .. ఈ జంటకు హిట్ ను ఇవ్వడానికి బాగానే కష్టపడ్డాడని టాక్ నడుస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమాగా ఖుషీ రిలీజ్ అవుతుందని పోస్టర్ లో చెప్పేశారు. సెప్టెంబర్ 1 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మరి ఈ సినిమాతో ఈ జంట ఎలాంటి హిట్ ను అందుకుంటారో చూడాలి.
Musical blast begins with the first single of #Kushi on May 9th❤️🔥
In Telugu, Hindi, Tamil, Kannada & Malayalam ❤️#NaRojaaNuvve#TuMeriRoja#EnRojaaNeeye#NannaRojaNeene@TheDeverakonda @Samanthaprabhu2 @ShivaNirvana @HeshamAWMusic @prawinpudi @saregamasouth pic.twitter.com/1kSZou8xn1
— Mythri Movie Makers (@MythriOfficial) May 4, 2023