Kumari Aunty: అనుకున్నదే అయింది.. కుమారి ఆంటీ సాధించేసింది!!
- సోషల్ మీడియాలో సూపర్ ఫాలోయింగ్ సాధించిన కుమారి ఆంటీ
- ఫుడ్ స్టాల్ నడిపే స్థాయి నుంచి సోషల్ మీడియా సెలబ్రిటీ స్థాయికి
- బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తోంది అంటూ వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kumari Aunty to Enter Bigg Boss Telugu 8 Show: కుమారి ఆంటీ గురించి తెలుగు ప్రేక్షకులకు, ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దాసరి సాయి కుమారి అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ కుమారి ఆంటీ అనగానే ఆమెను ఇట్టే గుర్తుపడతారు. సుమారు 13 ఏళ్ల నుంచి హైదరాబాద్ రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తుంది ఆమె. సోషల్ మీడియా పుణ్యమా అని ఆమెకు ఈ ఏడాది మొదట్లో మంచి క్రేజ్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ చూసి ఆమె వంట రుచి చూసేందుకు వందల మంది కుమారి అండ్ స్ట్రీట్ ఫుడ్ స్టాల్ వద్దకు క్యూ కట్టడంతో ట్రాఫిక్ పోలీసులు ఆమె బిజినెస్ కూడా ఒకరోజు ఆపేశారు. చివరికి ఏకంగా రేవంత్ రెడ్డి కల్పించుకొని ఆమె బిజినెస్ కి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ దెబ్బతో ఆమెను కొన్ని టీవీ ఛానల్స్ తమ సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కూడా ఎంట్రీ ఇప్పించి క్రేజ్ ను బాగానే క్యాష్ చేసుకున్నారు.
Suresh Gopi: ఇందిరాగాంధీని ‘భారతమాత’గా అభివర్ణించిన కేంద్రమంత్రి..
Also Read
- Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
- Toxic : 'పాన్ ఇండియా స్టార్' అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
- Himanshi Khurana: మతం మారమని ప్రియుడి ఒత్తిడి.. దేవుడికి ద్రోహం చేయలేనంటూ.. నటి ప్రేమకథ వెనుక కన్నీటి నిజాలు
- Shradha Kapoor : సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న శ్రద్ధాకపూర్ రెమ్యునరేషన్ డీల్
ఆ సంగతి అలా ఉంచితే ఆమెను సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో హైప్ చేస్తున్న సమయంలో ఏదో ఒక రోజు ఆమెను బిగ్ బాస్ లోకి పంపించే వరకు ఆగేలా లేరని కూడా ట్రోల్స్ నడిచాయి. ఇప్పుడు ఆ ట్రోల్స్ ఏ నిజం అయ్యాయి. ఆమెను ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ లోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి కొన్ని నెలల్లో ఈ సీజన్ మొదలైపోతున్న ఈ సీజన్ కోసం ఇప్పటికే వెతుకులాట ప్రారంభించింది బిగ్ బాస్ టీమ్. ఈ నేపథ్యంలో కుమారి ఆంటీని బిగ్ బాస్ కి రావాలని ఆహ్వానం పంపినట్టుగా చెబుతున్నారు. అయితే ఇంకా ఆమె ఫైనల్ డెసిషన్ చెప్పలేదని ప్రచారం జరుగుతోంది. గతంలో కూడా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్నవారిని బిగ్ బాస్ లోకి ప్రచారం జరిగింది కానీ సీజన్ మొదలయ్యాక వాళ్ళు హౌస్ లో కనిపించేవారు కాదు. మరి కుమారి ఆంటీ విషయం ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి.
తాజావార్తలు
-
Nainar Nagendran: సీఎం విజయ్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు బీజేపీ చీఫ్‌పై ఫిర్యాదు!
-
Motorola Edge 70 Pro: సగం ధరకే మోటరోలా ఎడ్జ్ 70 Pro.. 50MP కెమెరా, 6500mAh బ్యాటరీ, 8GB RAM తో ప్రీమియం డిజైన్
-
Sholay: భాష తెలియకపోయినా.. అమితాబ్ క్లాసిక్ కు ఇటాలియన్లు ఫిదా.. రాత్రి 3 వరకు 2,000 మందితో..
-
Toxic : ‘పాన్ ఇండియా స్టార్’ అనే టైటిల్ శాశ్వతం కాదు.. అది ఏ ఒక్కరి సొత్తు కాదు : యశ్
-
Guntur Chilli Export: గుంటూరు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటైనర్లు రిజెక్ట్!
ట్రెండింగ్
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!