ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్రను తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సత్యరాజ్ చేయటం విశేషం. ఓ విధంగా సత్యరాజ్ ప్రభాస్ కి లక్కీ హ్యాండ్ కూడా. ప్రభాస్ కి సూపర్ స్టార్ డమ్ తెచ్చిపెట్టిన ‘మిర్చి’తో పాటు పాన్ ఇండియా ఇమేజ్ తీసుకు వచ్చిన ‘బాహుబలి’ సీరీస్ లో సత్యరాజ్ నటించాడు. ఇప్పుడు అదే సెంటిమెంట్ ‘రాధేశ్యామ్’ కి వర్కవుట్ అవుతుందని భావిస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సత్యరాజ్ పాత్రను తెలుగులో కృష్ణంరాజు చేశారు.
Read Also : Radhe Shyam Press Meet : లైవ్
గతంలో ప్రభాస్ తో కలసి ‘బిల్లా, రెబల్’లో నటించారు కృష్ణంరాజు. అవి రెండూ నిరాశపరిచాయి. ‘రెబల్’ అయితే డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో వీర కలయికలో వస్తున్న ‘రాధేశ్యామ్’పై అందరి కళ్ళు ఉన్నాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ తెలుగులో నిరాశపరిచినా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. కరోనా తో పలుమార్లు వాయిదా పడిన ‘రాధేశ్యామ్’పై బజ్ తగ్గిన నేపథ్యంలో టీమ్ ప్రచారంతో ఒక్కసారిగా ఊపందుకుంది. మరి సత్యరాజ్ సెంటిమెంట్ ప్రభాస్ కి మరోమారు అచ్చివస్తుందా!? కృష్ణంరాజు సెంటిమెంట్ ను ఈ సారి బ్రేక్ చేసి సక్సెస్ అనిపించుకుంటుందా!? వీటన్నింటికి సమాధానం తెలియాలంటే ఈ నెల 11 వరకూ ఆగాల్సిందే… సో లెట్స్ వెయిట్ అండ్ సీ!