Koratal Siva Jr NTR Movie NTR30 Regular Shoot To Start From This Date: అప్పుడెప్పుడు భూమి పుట్టినప్పుడు NTR30 అనౌన్స్‌మెంట్ వచ్చింది. కానీ, ఇప్పటివరకూ సెట్స్ మీదకి వెళ్లలేదు. అదిగో, ఇదిగో అంటూ నాన్చుతున్నారే తప్ప.. షూటింగ్ స్టార్ట్ చేయట్లేదు. మొన్న తారక్ పుట్టినరోజు సందర్భంగా మోషన్ పోస్టర్ రిలీజయ్యాక, ఇక త్వరలోనే పట్టాలెక్కుతుందని అంతా ఆశించారు. కానీ, ఆ ఆశలపై యూనిట్ నీళ్లు చల్లేసింది. మరింత జాప్యం చేస్తూ వెళ్తోంది. స్క్రిప్ట్ పనులు ఇంకా కొలిక్కి రాకపోవడమే ఇందుకు కారణం. దీంతో, ఎప్పుడెప్పుడు ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్తుందా? అని ఫ్యాన్స్ పడిగాపులు కాస్తున్నారు.
అయితే.. ఇప్పుడు ఎంతో కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ సినిమా షూటింగ్‌కి మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేసేశారని సమాచారం. ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోన్న వార్తల ప్రకారం.. ఆగస్టు 26వ తేదీ నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించనున్నారట! అందుకోసం ఆల్రెడీ ఓ భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారని, ఒక హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌తో షూట్ స్టారర్ట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ యాక్షన్ సీన్ క్లైమాక్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఆలోపు తారక్ బరువు తగ్గి, పర్ఫెక్ట్ ఫిజిక్‌లోకి రానున్నాడట! స్క్రిప్ట్ పనులు దాదాపు తుది దశకు చేరుకోవడం, ఆ స్క్రిప్ట్‌తో తారక్ సంతృప్తి చెందడంతో.. సెట్స్ మీదకి వెళ్లాలని యూనిట్ డిసైడ్ అయినట్టు ఇన్‌సైడ్ న్యూస్! మరి, ఈసారి ఆగస్టు 26నే షూట్ స్టార్ట్ అవుతుందా? లేదా? అన్నది వేచి చూడాలి.
కాగా.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ పాన్ ఇండియా సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, హరి కృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందిస్తున్నారు కాబట్టి, బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని చూస్తున్నారు. అయితే, ఇప్పటివరకూ ఎవరూ ఫైనల్ కాలేదు. ఇతర నటీనటుల్ని సైతం ఎంపిక చేయాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్‌తో తారక్‌కి పాన్ ఇండియా ఇమేజ్ రావడం, జనతా గ్యారేజ్ తర్వాత మరోసారి కొరటాలతో చేతులు కలపడంతో.. NTR30 పై భారీ అంచనాలున్నాయి.