kodali Nani fires on Balakrishna over Chandrababu Arrest: స్కిల్ డెవెలప్మెంట్ కేసులో ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ స్పందించారు. జగన్ పాలకుడు కాదు కక్షదారుడని, చంద్రబాబు అక్రమ అరెస్టు దుర్మార్గం అని అన్నారు. జగన్ సీఎం అయ్యాక అన్నం తినటం మానేసి కోర్టుల చేత చివాట్లు తింటున్నారని, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడే ముఖ్యమంత్రి ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని అన్నారు. నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, చంద్రబాబు నాయుడుని 16 నిమిషాలైన జైల్లో పెట్టాలన్నదే తన జీవిత లక్ష్యమన్నట్టు జగన్ కక్ష సాధిస్తున్నారని విమర్శించిన బాలక్రినా స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడిని ఏ చట్టం ప్రకారం అరెస్ట్ చేశారు? అని ప్రశ్నించారు.
Sreenu Vaitla: శ్రీను వైట్ల అజ్ఞాత వాసానికి తెర.. సినిమా మొదలెట్టేశాడు!
ఇక బాలకృష్ణ ఏపీ సీఎం జగన్ మీద ఈ వ్యాఖ్యలు చేయడంతో మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర స్థాయిలో అనుచిత వ్యాఖ్యలు చేశారు. పురందేశ్వరి, చంద్రబాబు కలిసి ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారని.. అందుకే ఆయన అరెస్టును పురందేశ్వరి ఖండిస్తున్నారని మంత్రి కొడాలి నాని అన్నారు. తలపై ఎవరిదో బొచ్చు పెట్టుకొని(విగ్) తిరుగుతున్న బాలకృష్ణ, ఇప్పుడైనా కనీసం బ్రెయిన్ అయినా వాడాలని అన్నారు. అంతేకాక ‘బాలకృష్ణ బొచ్చు లెస్.. బ్రెయిన్ లెస్’ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకొనే పవన్.. ఆయనకు మద్దతుగా మాట్లాడటం సహజమే అని కూడా పేర్కొన్నారు. ఇక అంతకముందు చంద్రబాబు అరెస్ట్ పై కొడాలి నాని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఇన్నాళ్లూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ వచ్చిన చంద్రబాబు పాపం పండింది అంటూ ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తన పోస్ట్ కింద కరప్షన్ కింగ్ సీబీఎన్, స్కామ్ స్టార్ చంద్రబాబు అనే హ్యాష్ ట్యాగ్లు కూడా జత చేశారు.