Sreenu Vaitla: శ్రీను వైట్ల అజ్ఞాత వాసానికి తెర.. సినిమా మొదలెట్టేశాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sreenu Vaitla Film With Gopichand Launched Finally: ఆనందం, వెంకీ, ఢీ, దుబాయ్ శీను, దూకుడు లాంటి హిట్స్ అందుకున్న శ్రీను వైట్ల చివరిగా అమర్ అక్బర్ ఆంటోనీ అనే సినిమాతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన మంచు విష్ణు హీరోగా ఢీ సీక్వెల్ అనౌన్స్ చేశారు కానీ అది క్యాన్సిల్ అయింది. ఇక ఆయన సినిమాలకు గుడ్ బై చెబుతారేమో అనే ప్రచారం నేపథ్యంలో సైలెంటుగా ఆయన సినిమా మొదలు పెట్టేసి షాక్ ఇచ్చాడు. ‘మాచో స్టార్’ గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో కొత్త ప్రొడక్షన్ హౌస్ అయిన చిత్రాలయం స్టూడియోస్ ప్రొడక్షన్ నెం.1 ఈ రోజు అనౌన్స్ చేశారు. మాస్, ఫ్యామిలీస్ ని సమానంగా మెప్పించే యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను రాయడంలో, తీయడంలో సిద్ధహస్తుడైన శ్రీను వైట్ల, గోపీచంద్ ను ఇంతకు ముందు చేయని పూర్తి భిన్నమైన పాత్రలో చూపించడానికి ఒక హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రూపొందించనున్నారని సినిమా యూనిట్ వెల్లడించింది. సినిమా నిర్మాణం పట్ల ప్యాషన్ ఉన్న వేణు దోనేపూడి స్టార్ క్యాస్టింగ్ తో భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లను రూపొందించేందుకు సూపర్‌స్టార్ కృష్ణ ఆశీస్సులతో కొత్త ప్రొడక్షన్ బ్యానర్ చిత్రాలయం స్టూడియోస్‌ను ప్రారంభించారు.
Gudivada Amarnath: చంద్రబాబుకు కనీసం 10 ఏళ్ల జైలు శిక్ష ఖాయం..! లాలూ ప్రసాద్‌ను జైల్లో పెట్టలేదా..?
Also Read
#గోపీచంద్ 32 ఈ ప్రొడక్షన్ హౌస్ నుండి వస్తున్న మొదటి సినిమా. సినిమాలోని చాలా భాగం విదేశాల్లోని కొన్ని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరించనున్నారని తెలుస్తోంది. ఇక భారీ బడ్జెట్‌తో లావిష్ గా రూపొందనున్న #గోపీచంద్ 32 ఈరోజు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. ముహూర్తం షాట్‌కు మైత్రి మూవీ మేకర్స్ నవీన్ కెమెరా స్విచాన్ చేయగా, లెజెండరీ దర్శకుడు కె రాఘవేంద్రరావు క్లాప్ కొట్టారు. శ్రీను వైట్ల స్వయంగా తొలి షాట్‌కి దర్శకత్వం వహించగా రమేష్ ప్రసాద్, ఆదిశేషగిరిరావు, సురేష్ బాబు సహా మరికొందరు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుందని తెలుస్తోంది. శ్రీనువైట్ల పలు బ్లాక్‌బస్టర్స్‌తో అనుబంధం ఉన్న గోపీ మోహన్ స్క్రీన్‌ప్లే అందించగా కెవి గుహన్ కెమెరామెన్ గా పని చేస్తున్నారు. చైతన్ భరద్వాజ్ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమాకి సంబందించిన ఇతర టెక్నికల్ టీమ్‌ను త్వరలో మేకర్స్ తెలియజేస్తారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
-
Redmi K200 Series: Redmi K200 సిరీస్‌లో 7 ఇంచుల 2K డిస్‌ప్లే?.. హై రిఫ్రెష్ రేట్‌తో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ ఫోన్లు!
-
Rashmika Mandanna : మరోసారి పుష్పరాజ్ అండ్ శ్రీవల్లి కాంబో ఆకట్టుకోబోతుందా..?
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!