టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ స్టార్టింగ్ నుండి విభిన్నమైన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ లాంటి జయ జానకి నాయకలో ఆయన చూపించిన హై వోల్టేజ్ యాక్షన్, సస్పెన్స్ జానర్ రాక్షసుడులో బెల్లం బాబు ఇంటెన్స్ పర్ఫామెన్స్ ఆడియెన్స్ ను మెప్పించింది.
Also Read : Prabhas : ఫీల్ అవకండి డార్లింగ్స్.. అక్టోబర్ నుండి రెబల్ టైమ్ స్టార్ట్..
ఇక ఇప్పుడుబెల్లం కొండ నటించిన తాజాచిత్రం కిష్కిందపురి. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తోంది. హారర్ థ్రిల్లర్ జానర్ లో వచ్చిన ఈ సినిమాకు యునానిమస్ పాజిటివ్ టాక్ తో మొదటి రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకుంది. మౌత్ టాక్ ఆ సినిమాకు కలిసొచ్చింది. మొదటి రోజు 50K టికెట్స్ బుక్ అవగా రెండవ రోజు ఏకంగా 75k టికెట్స్ సోల్డ్ అయ్యాయి. ఇటీవల టాలీవుడ్ లో హారర్ జానర్ సినిమాలు ఆడియెన్స్ ను మెప్పించిన దాఖలాలు లేవు. ఇప్పుడు కిష్కిందపురి ఆ లోటును భర్తీ చేసిందనే చెప్పాలి. కథ, కథనంలో అనవసరపు హంగులు లేకండా అనుకున్న పాయింట్ ను తెరపై మలచడంలో టీమ్ సక్సెస్ అయింది. ఇక హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ కు ఈ సినిమా కెరీర్ బెస్ట్ అని చెప్పడంలో సందేహం లేదు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సినిమాను భుజాలపై మోశాడు. క్లైమాక్స్ లో బెల్లం కొండ నటన సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అలాగే ఈ సినిమాను మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు ప్రీమియర్స్ నుంచి హౌస్‌ఫుల్ షోలు వరకు ప్రతి ఈవెంట్‌లో పాల్గొంటున్నాడు. అలాగే తన నుండి రాబోయే టైసన్ నాయుడు, హైందవ సినిమాలు రెండు వేరు వేరు జానర్ లో ఉంటాయని తప్పకుండా ఆడియెన్స్ ను మెప్పిస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు బెల్లంకొండ. నేడు వీకెండ్ కావడంతో కిష్కింధపురి తెలుగురాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తుంది కిష్కింధపురి.