Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా తాజాగా ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలు చెప్పారు. ఈ సినిమా ట్రైలర్ చివరలో కాంతారలో రిషబ్ శెట్టి స్టైల్ లో ఓ వ్యక్తి కనిపించారు. ఆయన స్టార్ హీరో అంటూ మొన్నటి నుంచి ప్రచారం జరుగుతోంది. దానిపై విజయ్ కు ప్రశ్న ఎదురైంది. కింగ్ డమ్ లో మరో స్టార్ హీరో నటిస్తున్నారా అని రిపోర్టర్లు ప్రశ్నించారు. విజయ్ స్పందిస్తూ.. అది మీరు సినిమా చూసి తెలుసుకుంటేనే బెటర్. అవును మీరు అనుకున్నట్టు స్టార్ హీరోనే అంటూ బ్లాస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు విజయ్.
Read Also : Anasuya : నచ్చిన డ్రెస్సులు వేసుకుంటా మీకేంటి.. అనసూయ ఫైర్
దీంతో ఎవరా స్టార్ హీరో అంటూ పెద్ద ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని కావాలనే దాచిపెట్టారేమో అని తెలుస్తోంది. చూస్తుంటే సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందేమో అనే ప్రచారం మొదలైంది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఇలాంటి సినిమాలో నటించలేదు. ఇందులోని కంటెంట్, యాక్షన్, ఎమోషన్ అన్నీ ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్ ముందు వరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కింగ్ డమ్ రికార్డులు సృష్టిస్తోంది. మరి ఆ పెద్ద హీరో థియేటర్లలో కనిపిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.
Read Also : Kingdom : అందుకే పద్ధతిగా మాట్లాడుతున్నా.. విజయ్ క్లారిటీ