Kingdom : విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన కింగ్ డమ్ నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ మూవీ భారీ అంచనాలతో వచ్చి మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. తాజాగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించి అందరికీ థాంక్స్ చెప్పింది. అయితే ఈ సినిమాలో పెద్ద హీరో కామియో రోల్ చేశాడని రిలీజ్ కు ముందే హింట్ ఇచ్చారు. కానీ ఎవరనేది మూవీలో చూపించలేదు. తాజాగా ఈ విషయంపై టీమ్ క్లారిటీ ఇచ్చింది. నాగవంశీ స్పందిస్తూ.. మూవీకి పార్ట్-2 వస్తుంది. అందులో పెద్ద హీరో నటిస్తారని క్లారిటీ ఇచ్చారు. అందుకే ఈ పార్ట్-1లో రివీల్ చేయలేదన్నారు.
Read Also : Kingdom : విజయ్ ‘కిస్’ సీన్ పై నాగవంశీ సెటైర్లు
ప్రస్తుతం విజయ్ దేవరకొండ చేతిలో ఉన్న సినిమాలు అయిపోగానే సెకండ్ పార్ట్ స్టార్ట్ చేస్తామని స్పష్టం చేశారు నాగవంశీ. విజయ్ మాట్లాడుతూ.. ఈ మూవీ కోసం ఏడాదిన్నర కష్టపడ్డందుకు మంచి రిజల్ట్ వచ్చిందన్నారు. సినిమా చూసిన వారంతా ఇస్తున్న రివ్యూలు చాలా సంతోషంగా ఉందని తెలిపారు విజయ్. ఈ సినిమాను వెంకన్న దయ, ప్రేక్షకుల ప్రేమతో హిట్ చేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు చేసిన సినిమాల కంటే ఇది తనకు చాలా స్పెషల్ అంటూ వివరించారు.
Read Also : Kingdom : కింగ్ డమ్ పార్ట్-2 వచ్చేది అప్పుడే.. నాగవంశీ క్లారిటీ