Killer Soup: ఈ మధ్యకాలంలో ఎక్కువ సినిమాలు, సిరీస్ లు వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఎప్పటికప్పుడు రియలిస్టిక్ కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. ఈ మధ్యనే కర్రీ అండ్ సైనైడ్ డాక్యుమెంటరీ ప్రేక్షకులను ఎంత మెప్పించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలను మరియు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఈవారం కూడా అనేక చిత్రాలు మరియు వెబ్ సిరీసులు ఓటీటీలలోకి వచ్చేసాయి.. అందులో కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ కూడా వుంది.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా వస్తోన్న కిల్లర్ సూప్‌లో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్ర పోషించాడు. మనోజ్ బాజ్ పాయి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాడు. ది…