Ghost: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులో కూడా ఆయన సుపరిచితుడే. గత కొన్నేళ్లుగా అయన సినిమాలు తెలుగులో కూడా మంచి ఆదరణను అందుకుంటున్నాయి. గతేడాది వేద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శివన్న.. ఈ ఏడాది ఘోస్ట్ గా రానున్నాడు. శ్రీనీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సందేశ్ నాగరాజ్ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా నేడు శివన్న బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి బిగ్ డాడీ వీడియోను రిలీజ్ చేశారు. ఘోస్ట్.. పేరుకు తగ్గట్టే శివన్న ఘోస్ట్ లా కనిపించాడు.
Mahesh Babu: జూనియర్ మహేష్ బాబు.. ఈ అల్లుడేనేమో.. మరీ జిరాక్స్ కాపీలా ఉన్నాడే..?
ఒక పాడుబడ్డ డెన్ లో స్టైల్ గా కుర్చీలో కూర్చొని.. పానీపూరీని మందులో ముంచుకొని తింటూ కనిపించాడు. అంతలోనే రౌడీలు ఆయనను గన్ లతో చుట్టుముట్టగా.. ఆయన వెనుక పెద్ద మిలటరీ యుద్ధ ట్యాంకర్ ను చూపిస్తాడు. దీంతో ఆ రౌడీలా ఫేస్ లు మాడిపోతాయి. ” మీరు గన్ తో ఎంతమందిని భయపెట్టారు.. అంతకంటే ఎక్కువ మందిని నా కళ్లుతో భయపెట్టాను. వాళ్లు నన్ను OG అని పిలిచేవారు.. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్” అని శివన్న చెప్పిన డైలాగ్ తో వీడియో ముగుస్తుంది. ఇక ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తెలుగులో పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబోలో వస్తున్న చిత్రం OG. ఒరిజినల్ గ్యాంగ్ స్టర్. ప్రస్తుతం ఈ సినిమాను, ఆ డైలాగ్ ను కలిపి అభిమానులు మీమ్స్ వేస్తున్నారు. పవన్ కన్నా ముందు OG నేనే అంటున్న శివన్న.. ఈ సినిమాతో ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.