Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే దసరాతో హిట్ అందుకున్న ఈ చిన్నది.. జోష్ పెంచేసింది. ఇక కీర్తి సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ఎప్పటినుంచో కీర్తి.. ఒక బిజినెస్ మ్యాన్ ను పెళ్ళాడుతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ మధ్యనే కీర్తి.. ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉన్న ఫోటోను షేర్ చేసింది. దీంతో అతనే కీర్తికి కాబోయే భర్త అంటూ వార్తలు పుట్టుకొచ్చేశాయి. ఆ వార్తలపై కీర్తి స్పందిస్తూ.. మీరు అనుకున్న అబ్బాయి ఇతను కాదు. ఇతను ఎవరో మీరే గుర్తించండి అని ఫజిల్ విసిరింది. ఆ తరువాత అతడు తన క్లోజ్ ఫ్రెండ్ అని, ఎవ్వరు ఈ విషయాన్నీ చెప్పలేకపోయారని చెప్తూ.. తన జీవితంలోని మిస్టరీ మ్యాన్ ను సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చెప్తాను అని చెప్పుకొచ్చింది. అయినాఈ రూమర్ మాత్రం ఆగలేదు. తాజాగా ఈ రూమర్స్ పై కీర్తి తండ్రి స్పందించాడు. కీర్తి ఫోటో దిగిన అబ్బాయి తనకు తెలుసనీ, అతడు పేరు ఫర్హాన్ అని చెప్పుకొచ్చాడు.
Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నాడంటే ..?
” గత కొన్నిరోజులుగా నా కూతురు కీర్తి గురించి వస్తున్న రూమర్స్ లో నిజం లేదు. అతడు ఫర్హాన్.. నా కూతురు ఫ్రెండ్. మాక్కూడా అతను తెలుసు. కీర్తి పెళ్లి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరికి చెప్తాను. అప్పటివరకు దయచేసి ఎలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయకండి.. ఈ ఫేక్ న్యూస్ వలన ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదు” అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.