Keerthy Suresh: మహానటి కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఈ మధ్యనే దసరాతో హిట్ అందుకున్న ఈ చిన్నది.. జోష్ పెంచేసింది. ఇక కీర్తి సినిమాల విషయం పక్కన పెడితే.. గత కొన్నిరోజులుగా ఆమె ప్రేమ, పెళ్లి వార్తలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
Keerthy Suresh: కీర్తి సురేష్ అంటే మహానటి సినిమా తప్ప మరో సినిమా గుర్తుకు రాదు అంటే అతిశయోక్తి కాదు. మహానటి సావిత్రి బయోపిక్ లో ఆమె నటించింది అనడం కన్నా సావిత్రిలా జీవించింది అని చెప్పొచ్చు. ఏ ముహూర్తాన కీర్తి ఆ సినిమా చేసిందో కానీ ఆ సినిమా తరువాత అంతటి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది.
(అక్టోబర్ 17న కీర్తి సురేశ్ పుట్టినరోజు)నవతరం నాయిక కీర్తి సురేశ్ పేరు వినగానే ‘మహానటి’ ముందుగా గుర్తుకు వస్తుంది. తెలుగు సినిమా రంగంలోనే పలు వెలుగులు విరజిమ్మిన కీర్తి సురేశ్ కీర్తి కిరీటంలో ‘మహానటి’ చిత్రం ఓ మేలిమి రత్నంగా వెలసింది. జాతీయ స్థాయిలో కీర్తి సురేశ్ ను ఉత్తమనటిగా నిలిపిన ‘మహానటి’ని జనం మరచిపోలేరు. ఆ సినిమా తరువాత నుంచీ సంప్రదాయబద్ధంగా సాగుతోంది కీర్తి. కీర్తి సురేశ్ ఓ నాటి అందాల నాయిక మేనక కూతురు.…