Keerthy Suresh: ‘మహానటి’గానే జనం మదిలో.. కీర్తి సురేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keerthy Suresh:’మహానటి’ అన్న పదం సావిత్రి ఇంటిపేరుగా నిలచింది. తెరపై సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేశ్ పేరు ముందు కూడా ఇప్పుడు ‘మహానటి’ చేరిపోయింది. అంతలా సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి సురేశ్ కు జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు కూడా లభించింది. దాంతో కీర్తి గ్లామర్ రోల్స్ లో కనిపించినా సరే, జనం మాత్రం ఆమెను ‘మహానటి’ అనే పిలుస్తున్నారు.
చిరంజీవి నటజీవితంలో మరపురాని చిత్రాల్లో ‘పున్నమినాగు’ ప్రధానమైనది. అందులో ఆయన సరసన నాయికగా నటించిన మేనక కూతురే కీర్తి సురేశ్. ఆమె తండ్రి సురేశ్ కుమార్ మళయాళ చిత్ర దర్శకుడు. మేనక, సురేశ్ కుమార్ దంపతులకు 1992 అక్టోబర్ 17న కీర్తి సురేశ్ జన్మించింది. చెన్నైలోని పెరల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ లో పట్టా పుచ్చుకుంది కీర్తి సురేశ్. ఆమెకు వయోలిన్ వాయించడంలోనూ ప్రావీణ్యం ఉంది. ఫ్యాషన్ డిజైనింగ్ లో సీరియస్ గా సాగాలనుకుంది కీర్తి. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో “పైలట్స్, అచనేయనేనిక్కిష్టమ్, కుబేరన్”వంటి మళయాళ చిత్రాలలో బాలనటిగా నటించింది. ప్రియదర్శన్ తెరకెక్కించిన ‘గీతాంజలి’ అనే హారర్ ఫిలిమ్ లో ద్విపాత్రాభినయం చేస్తూ నాయికగా పరిచయమైంది కీర్తి. తెలుగులో ‘నేను శైలజ’లో రామ్ సరసన నటించి, ఇట్టే తెలుగువారిని ఆకట్టుకుంది. నానితో కలసి ‘నేను లోకల్’లో ముద్దుగా మురిపించింది. ‘అజ్ఞాతవాసి’లో పవన్ కళ్యాణ్ తోనూ నటించింది. ఇక సావిత్రి జీవితగాథగా తెరకెక్కిన ‘మహానటి’లో జీవించేసింది కీర్తి. అందువల్లే ఆ యేడాది అత్యుత్తమనటిగా జాతీయ స్థాయిలో నిలచింది. ‘మన్మథుడు-2’లో ప్రత్యేక పాత్రలో కనిపించింది కీర్తి. “పెంగ్విన్, మిస్ ఇండియా” వంటి ఓటీటీ మూవీస్ లోనూ కీర్తి అభినయం ఆకట్టుకుంది. ‘జాతిరత్నాలు’లో కాసేపే కనిపించినా, కవ్వించింది. ‘రంగ్ దే’లో నితిన్ తో జోడీ కట్టి మరోమారు నటనతో ఆకట్టుకుంది. మహేశ్ బాబు సరసన కీర్తి సురేశ్ గ్లామర్ ఒలకబోసిన ‘సర్కారువారి పాట’ సైతం అలరించింది. ఆమె నటించిన ‘గుడ్ లక్ సఖీ’ కూడా మురిపించింది.
Also Read
- Navakanth : రామ్ చరణ్ కంటికి గాయం కావడంతో నాకు ఏడుపు వచ్చేసింది!
- Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. నాపై క్షుద్ర పూజలు.. ఆ ‘ఇడ్లీ నటి’ వల్లే నా బతుకు ఇలా.. జయం రవి కన్నీరు
- Peddi: పెద్ది ట్రైలర్'పై చిరు రివ్యూ.. డైలాగ్ లీక్
- Dhurandhar 2: బ్యాన్ చేసిన దేశంలో బ్లాక్‌బస్టర్.. దాయాది దేశంలో ‘‘ధురంధర్ 2’’ క్రేజ్..
కీర్తి సురేశ్ నటించిన కొన్ని పరభాషా చిత్రాలు సైతం తెలుగులోకి అనువాదమై అలరించాయి. చిరంజీవి హీరోగా రూపొందుతోన్న ‘భోళా శంకర్’లోనూ కీర్తి సురేశ్ కనిపించనుంది. నాని హీరోగా తెరకెక్కుతోన్న ‘దసరా’లోనూ కీర్తి నాయికగా నటిస్తోంది. ఈ చిత్రాలు కాక మరికొన్ని సినిమాల్లోనూ కీర్తి తనదైన అభినయంతో అలరించనుంది. తన దరికి చేరిన ప్రతీపాత్రనూ అంగీకరించకుండా, మనసుకు నచ్చిన రోల్స్ ను ఎంపిక చేసుకొని సాగుతోంది కీర్తి. మరి రాబోయే చిత్రాలలో కీర్తి సురేశ్ ఏ రీతిన తన నటనతో మురిపిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Video: ప్రాణాలకు తెగించి దొంగలను తరిమికొట్టిన నగలషాపు సిబ్బంది.. వీడియో వైరల్..
-
Peddi: పెద్ది సినిమాలో విక్కీ కౌశల్ తండ్రి?
-
Rahul Gandhi: దేశంలో 80 సార్లు పేపర్ లీక్.. విద్యామంత్రిని తొలగించాలి..
-
Thailand Train Crash: బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన గూడ్స్ రైలు.. 8 మంది మృతి
-
CM Vijay-Kamal haasan: సీఎం విజయ్‌తో కమల్‌హాసన్ భేటీ.. ప్రత్యేక బహుమతి అందజేత
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..