Kavin: కోలీవుడ్ యంగ్ హీరో కెవిన్ పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ను మొదలుపెట్టాడు కెవిన్. ఇక సీరియల్ హీరోగా మారి అక్కడనుంచి బిగ్ బాస్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ నుంచి వచ్చాకా.. నత్పున ఎన్నను తేరియుమా అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. లిఫ్ట్ అనే హర్రర్ సినిమాతో మంచి గుర్తింపును అందుకున్న కెవిన్ ఈ ఏడాది వచ్చిన దాదా సినిమాతో ఫేమస్ అయిపోయాడు. ఫిబ్రవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. తెలుగు అభిమానులు కూడా ఈ సినిమాకు ఫిదా అయిపోయారు. భార్య వెళ్ళిపోతే.. కొడుకును పెంచే తండ్రిగా కెవిన్ నటన అద్భుతమని చెప్పొచ్చు. ఇక కెవిన్ నటన చూసి.. తెలుగులో కూడా మంచి అవకాశాలు వస్తాయి అని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేసారు. మరి త్వరలోనే కెవిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
Prabhas: ప్రభాస్ కీలక నిర్ణయం.. ఆనందంలో డార్లింగ్ ఫ్యాన్స్.. ?
ఇక ఈ సినిమా హిట్ తరువాత వరుస అవకాశాలను అందుకుంటున్న కెవిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అతని చిన్ననాటి స్నేహితురాలు అయినా మౌనికను వివాహమాడనున్నాడు. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారట. ఈ మధ్యనే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించడంతో.. ఇరు కుటుంబాలు వీరి పెళ్లిని ఆగస్టు 20 న జరపడానికి అంగీకరించారు. మరికొన్ని రోజుల్లో కెవిన్ ఈ విషయాన్ని అభిమానులకు అధికారికంగా వెల్లడించనున్నాడు. ఇక ఈ విషయం తెలియడంతో అభిమానులు కెవిన్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.