Kasturi: సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం గృహాలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బిజీగా మారింది. ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కస్తూరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మనసులో ఏది ఉంటె అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు ఆ మాటల వలన వివాదాలను కొనితెచ్చుకుంటుంది. ఇక తాజాగా కస్తూరి తన జీవితంలో జరిగిన చేదు అనుభవాన్ని పంచుకుంది. సెలబ్రిటీలను రియల్ గా చూడాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు అన్న విషయం తెల్సిందే. వారిని తాకాలని, వారితో ఫోటో దిగాలని గుంపులో తోసుకుంటూ వెళ్ళిపోతారు. కొంతమంది అయితే.. వారి మీద పడిపోయి ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేస్తారు. ఇది చాలామంది సెలబ్రిటీలు ఎదుర్కుంటున్న సమస్య. అయితే స్టేజిపై ఇలాంటివి ఎవ్వరు మాట్లాడారు. కానీ, చాలాతక్కువమంది ఈ విషయాలను పంచుకుంటారు. ఈ మధ్యనే ఇక మలయాళ స్టార్ హీరో దుల్కర్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలిపాడు. ఒక మహిళ తన ఫ్యాన్ అని చెప్పుకుంటూ వచ్చి.. తనను బుగ్గపై ముద్దు పెట్టాలని చాలా ప్రయత్నించింది. గతంలో కూడా ఒక పెద్దావిడ తనను అసభ్యంగా తాకుతూ నన్ను చిరాకు పెట్టింది అని తెలిపాడు. ఇక ఇప్పుడు అలానే తనకు అయ్యిందని కస్తూరి చెప్పుకొచ్చింది.
“కోలీవుడ్‌లో స్టార్స్ అసోసియేషన్ ఈవెంట్ కు రమ్మని నాకు పిలుపు వచ్చింది. ఈవెంట్ అయ్యాక కూడా చాలామంది ఫ్యాన్స్ అక్కడ ఉన్నారు. ఇక నేను బయటికి వెళదామని ముందుకు కదులుతుంటే.. ఎవరో నా బ్యాక్ ను నొక్కుతున్నట్లు అనిపించింది. అది జరిగినప్పుడు మా నాన్న నా పక్కనే ఉన్నారు. వెంటనే ఆ చేయి పట్టుకొని ముందుకు లాగాను. ఇక వాడు నన్ను చూడగానే.. అక్కా.. సారీ అంటూ ఏడవడం మొదలుపెట్టాడు. ఇలాంటి చెత్తపనులు చేసి దొరికిపోయి.. అక్కా అని వేడుకోవడం చాలా దరిద్రం.. అలంటి పనులు చేయడమెందుకు.. ” అని చెప్పుకొచ్చింది.