Kasturi: సీనియర్ హీరోయిన్ కస్తూరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం గృహాలక్ష్మి సీరియల్ లో నటిస్తూ బిజీగా మారింది. ఈ సీరియల్ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక కస్తూరి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మనసులో ఏది ఉంటె అది మాట్లాడేస్తుంది. కొన్నిసార్లు ఆ మాటల వలన వివాదాలను కొనితెచ్చుకుంటుంది.