సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. అటు వైసీపీ నాయకులతో పాటుగా, మరోవైపు సినీ సెలెబ్రిటీలు కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించిన వ్యాఖ్యలపై మద్దతు పలుకుతున్నారు. తాజాగా ఆర్ఎక్స్ 100 సినిమా ఫేమ్ కార్తికేయ స్పందించారు.
‘నేను ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా గాని, సపోర్ట్ చేస్తూ కానీ మాట్లాడట్లేదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఇబ్బందుల గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ సర్ స్పీచ్ విన్నాక, ఈ విషయంలో పవన్ సర్ కి మద్దతు ఇవ్వడం నా బాధ్యత అని భావిస్తున్నా..’ అంటూ హీరో కార్తికేయ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రకటించారు.