Kartikeya Gummakonda and UV Concepts #Kartikeya8 pre look out: ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ లో హీరో కార్తికేయ గుమ్మకొండ ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తోందని పేర్కొన్నారు. ఇక హ్యాపీడేస్ రాహుల్ టైసన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అజయ్ కుమార్ రాజు.పి. కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమా నుంచి ఈద్ పండుగ శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమా ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ఇక రేపు మధ్యాహ్నం 12.06 నిమిషాలకు ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఇక ఈ సినిమా ప్రీ లుక్ అయితే ఇన్నోవేటివ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
Lucky Baskhar Teaser: ఈ భాస్కర్ గాడు లక్కు తోక తొక్కాడు సార్!
ఇది కార్తికేయ నటిస్తున్న 8వ సినిమా కాగా న్యూ ఏజ్డ్ కాన్సెప్ట్ బేస్డ్ గా రూపొందుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు కూడా సిద్ధమవుతోంది. ఒక రకంగా సైలెంట్ గా షూట్ పూర్తి చేసిన ఈ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను కూడా త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గాంధీ నడికుడికర్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి ఆర్.డి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. రధన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి కపిల్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు.