Lucky Baskhar Teaser: ఈ భాస్కర్ గాడు లక్కు తోక తొక్కాడు సార్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucky Baskhar Teaser Released: వివిధ భాషల్లో, విభిన్న సినిమాలు చేస్తూ దేశవ్యాప్తంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ‘మహానటి’, ‘సీతారామం’ వంటి ఘన విజయాలతో తెలుగులో కూడా మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ ను బట్టి చూస్తే ‘లక్కీ భాస్కర్’ సినిమాలో బ్యాంక్ క్యాషియర్‌గా మునుపెన్నడూ చూడని ఒక సరి కొత్త లుక్‌లో దుల్కర్ సల్మాన్ దర్శనం ఇచ్చాడు. ఈ సినిమా టీజర్ ఒక సాధారణ బ్యాంకు ఉద్యోగి అసాధారణ స్థాయికి ఎలా చేరుకున్నాడు అనే ఆసక్తిని రేకెత్తిస్తూ కట్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది. ఒక మధ్యతరగతి వ్యక్తి, భారీ మొత్తంలో డబ్బు ఎలా సంపాదించాడు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనే ప్రశ్నలతో టీజర్ ని మలిచిన తీరు మెప్పించింది.
Jr NTR’s look in WAR 2 : వార్2 ఎన్టీఆర్ లుక్ లీక్.. కటౌట్ అదిరింది!
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
అలాగే టీజర్ లో దుల్కర్ సల్మాన్ పలికిన సంభాషణలు, కెమెరా పనితనం, నేపథ్య సంగీతం కట్టిపడేసేలా ఉన్నాయి. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తుండగా శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. మీనాక్షి చౌదరి ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్ కి జోడిగా నటిస్తోంది. ఇక ‘లక్కీ భాస్కర్’ సినిమాకి అత్యుత్తమ సాంకేతిక బృందం పని చేస్తోంది. నిమిష్ రవి ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి కళా దర్శకుడిగా బంగ్లాన్, ఎడిటర్ గా నవీన్ నూలి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘లక్కీ భాస్కర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!