సూర్య- కార్తీక్ సుబ్బరాజు కాంబోలో వస్తున్న రెట్రో మే 1న థియేటర్లలోకి రాబోతుంది. రీసెంట్లీ రిలీజ్ చేసిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ పిక్చర్ పై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇదిలా ఉంటే డై హార్ట్ ఫ్యాన్స్ కోసం మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నాడట దర్శకుడు. ఇందులో ఒకటి కాదు పది కాదు ఏకంగా 20 యాక్షన్ సీన్స్ ఉండనున్నాయని స్వయంగా స్టంట్ మాస్టర్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అంటే ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ మూవీని సిద్ధం చేస్తున్నాడు కార్తీక్.
Also Read : NANI : Hit 3 సెన్సార్ వివరాలు.. వారికి నో ఎంట్రీ
రెట్రోలో భారీ రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు కార్తీక్ సుబ్బరాజు. మే1న ఇక థియేటర్లు ఇక ఎరుపెక్కడమే తరువాయిట. మే 3 నుండి జపాన్ ప్రేక్షకులను కూడా పలకరించనుంది రెట్రో. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాతో సూర్యకు కంబ్యాక్ హిట్టునివ్వాలని కార్తీక్ తాపత్రయపడుతున్నాడు. సూర్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలపాలన్న లక్ష్యంతో ఈ సినిమాను డైరెక్ట్ చేసాడట కార్తీక్ సుబ్బరాజ్. రెట్రో రిలీజ్ దగ్గరపడటంతో బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమ విశేషాలను పంచుకుంటున్నాడు. కంగువతో భారీ డిజాస్టర్ చూసిన సూర్య ఈ దఫా ఎలాగైన హిట్ కొట్టాలనే భావిస్తున్నాడు. రెట్రో ఆ ఆశను నెరవేరుస్తుందని కూడా అనుకుంటున్నాడు సూర్య. తమిల్ తో పాటు తెలుగులోను రిలీజ్ కానున్నఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో రిలీజ్ చేస్తోంది. భారీ అంచనాల మధ్య వస్తున్న రెట్రో ఎటువంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.